Pimples And Dark Spots: మొటిమలు, నల్ల మచ్చలకు చెక్ పెట్టే అద్భుతమైన చిట్కా..ఈ ఫేస్ ప్యాక్‌తో అదమైన ముఖం మీ సొంతం..
Best Face Pack For Pimples And Dark Spots: దానిమ్మ ఫేస్ ప్యాక్ క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల ముఖానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Best Face Pack For Pimples And Dark Spots: ప్రతి ఒక్కరూ మచ్చలేని, మెరిసే చర్మాన్ని కోరుకుంటారు. అందుకోసం మార్కెట్‌లో లభించే చాలా రకాల ప్రోడక్ట్‌ను వినియోగిస్తారు. అయితే వీటిని వినియోగించడం వల్ల చర్మానికి చాలా రకాల సమస్యలు వచ్చే ఛాస్స్ ఉందని.. వాటిని వినియోగించకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటికి బదులుగా దానిమ్మతో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌ను వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. ఇందులో టానింగ్‌ను తొలగించే చాలా రకాల గుణాలున్నాయని దీనిని వినియోగించడం వల్ల ముఖంపై అన్ని రకాల సమస్యలు దూరమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే దీనిని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
దానిమ్మ ఫేస్ ప్యాక్ చేయడానికి కావలసిన పదార్థాలు:
దానిమ్మ రసం
2 టీస్పూన్ తేనె
1 విటమిన్-ఇ క్యాప్సూల్
దానిమ్మ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి?
దానిమ్మ ఫేస్ ప్యాక్ చేయడానికి.. ముందుగా చిన్న గిన్నె తీసుకోవాల్సి ఉంటుంది.
తర్వాత 1 దానిమ్మపండు తొక్క తీసి మెత్తగా చేసి రసం తీయాలి.
ఇలా తీసిన రసాన్ని గిన్నెలో వేసుకోవాల్సి ఉంటుంది. అందులో 1 విటమిన్-ఇ క్యాప్సూల్ వేయాలి.
తర్వాత వీటన్నింటిని బాగా మిక్స్ చేసి పేస్ట్ లా కలుపుకుంటే ఫేస్ ప్యాక్ తయారైనట్లే..
దానిమ్మ ఫేస్ ప్యాక్‌ను ఎలా వినియోగించుకోవాలి:
దానిమ్మ ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ముఖం శుభ్రం చేసుకోవాలి.
తర్వాత బ్రష్ సహాయంతో ఈ ఫేస్ ప్యాక్ ను మీ ముఖానికి బాగా అప్లై చేయండి.
సుమారు 15 నుంచి 20 నిమిషాల అలానే ఉంచి శుభ్రం చేసుకోండి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
ఇది కూడా చదవండి : Earthquake Death Toll: టర్కీ, సిరియా దేశాల్లో 34 వేలు దాటిన మరణాలు, 50 వేలకు చేరవచ్చని అనుమానం
ఇది కూడా చదవండి : Turkey-Syria Earthquake: 30 వేలకు చేరువలో భూకంప మృతుల సంఖ్య..!
ఇది కూడా చదవండి : Drank Urine to Survive: ఆ 4 రోజులు మూత్రం తాగి బతికాడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK