Get Rid of Lizards: ఇంట్లో ఈ 4 మొక్క నాటండి.. గోడపై ఒక్క బల్లి కూడా కనిపించదు..
Get Rid of Lizards: సాధారణంగా అందరి ఇళ్లలో బల్లులు కనిపించడం జరుగుతుంది. వాటిని తరమడానికి రకరకాల ప్రయత్రాలు చేస్తాం. మీరు ఇంటిని ఎంత శుభ్రం చేసినా, వంటగదిలో, బాత్రూమ్‌లో లేదా ఇంటి గోడపై బల్లి కనిపిస్తూనే ఉంటుంది.
Get Rid of Lizards: సాధారణంగా అందరి ఇళ్లలో బల్లులు కనిపించడం జరుగుతుంది. వాటిని తరమడానికి రకరకాల ప్రయత్రాలు చేస్తాం. మీరు ఇంటిని ఎంత శుభ్రం చేసినా, వంటగదిలో, బాత్రూమ్‌లో లేదా ఇంటి గోడపై బల్లి కనిపిస్తూనే ఉంటుంది.అయితే, మీ ఇంట్లో బల్లుల భయంతో మీరు కూడా ఇబ్బంది పడుతుంటే వాటిని తరిమికొట్టడంలో చాలా సహాయపడే కొన్ని మొక్కల గురించి మేము మీకు చెబుతాం. ఈ మొక్కల బలమైన వాసనతో బల్లులు దూరంగా ఉంటాయి.
పుదీనా..
మీ ఇంట్లో నుంచి బల్లులు పారిపోవాలంటే పుదీనా మొక్క నాటండి. ఈ మొక్క బల్లులను కూడా తరిమికొడుతుంది.పుదీనాలో మెంథాల్ అనే రసాయనం ఉంటుంది. ఇది బల్లులు తట్టుకోలేని ఘాటైన వాసనను వెదజల్లుతుంది. దీంతో మీ ఇంట్లో ఒక్క బల్లి కూడా కనిపించదు.
లావెండర్ ..
లావెండర్ మొక్క వాసన నుండి కూడా బల్లులు దూరంగా పారిపోతాయి. వాస్తవానికి, లినాలూల్ ,మోనోటెర్పెన్స్ వంటి రసాయన సమ్మేళనాలు ఇందులో కనిపిస్తాయి. అందుకే ఈ మొక్క వాసన రాగానే బల్లి ఇంట్లోంచి బయటకి వెళ్లే దారి వెతుక్కుని పారిపోతుంది.
ఇదీ చదవండి: అవకాడో నూనెతో 10 ఆరోగ్యప్రయోజనాలు.. మీ శరీరంలో నమ్మలేని మార్పులు..
లెమన్ గ్రాస్..
బల్లులను ఇంటి నుండి తరిమికొట్టడానికి ఇదో మరో అద్భుతమైన ఐడియా. మీరు ఇంట్లో లెమన్ గ్రాస్ మొక్కను కూడా నాటవచ్చు.ఇందులో సిట్రోనిల్లా అని పిలువబడే ఒక ప్రత్యేకమైన రసాయనం ఉంటుంది. ఇది ఒక రకమైన గడ్డి మొక్క దీని రుచి పుల్లగా ఉంటుంది. ఈ వాసనకు బల్లులు పారిపోతాయి.
ఇదీ చదవండి: ఒత్తైన మందపాటి జుట్టు కావాలా? షహనాజ్ హుస్సేన్ బ్యూటీ టిప్స్ ఫాలో అవ్వండి..
బంతి మొక్క..
బంతి మొక్క బల్లులను ఇళ్ల నుండి తరిమికొట్టడంలో కూడా చాలా సహాయకారిగా ఉంటుంది. ఈ పువ్వులలో పైరెత్రిన్ ,ట్రాపెజియం అనే క్రిమిసంహారకాలు ఉంటాయి. దాని వాసన కారణంగా బల్లి పారిపోతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter