Avocado Oil Health Benfits: అవకాడోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మనందరికీ తెలుసు. దీన్ని బ్రేక్ ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్లో యాడ్ చేసుకుంటాం. అయితే, అవకాడో నూనెతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా?సాధారణంగా అవకాడోనూనెను దాని గుజ్జు నుంచి తయారు చేస్తారు. ఇది సౌత్ సెంట్రల్ మెక్సికోలో ఎక్కువగా పండిస్తారు. అవకాడోనూనెలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో మోనో సాచురేటెడ్ కొవ్వు ఆలివ్ ఆయిల్ ఆయిల్ మాదిరి పనిచేస్తుది. అంతేకాదు ఇందులో మన శరీరానికి కావాల్సిన ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, డీ, ఈ, ఫైటోస్టెరల్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
అవకాడో నూనె మన డైట్లో చేర్చుకోవడం సులభం. దీన్ని మనం ఆహారం ఫ్రై చేసినప్పుడు, బేకింగ్ లో కూడా వాడొచ్చు. అంతేకాదు ఈ ఆయిల్ సలాడ్ డ్రెస్సింగ్, స్మూథీస్, గ్రిల్డ్ వెజిటేబుల్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు.
అవకాడో ఆయిల్ తో ఆరోగ్యప్రయోజనాలు..
1. గుండె ఆరోగ్యం..
అవకాడోలో మోనోసాచురేటెడ్ ఫ్యాట్ పుష్కలంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించే ఒలీక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది గుండె ప్రమాదాలు రాకుండా సహాయపడతాయి.
2. వాపు సమస్య..
ఇందులో ఒలీక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల వాపు సమస్యలను తగ్గిస్తాయి. దీనివ్లల అర్ర్థరైటీస్ సమస్యలు కూడా తగ్గిపోతాయి.
ఇదీ చదవండి: ఒత్తైన మందపాటి జుట్టు కావాలా? షహనాజ్ హుస్సేన్ బ్యూటీ టిప్స్ ఫాలో అవ్వండి..
3. జీర్ణ ఆరోగ్యం..
అవకాడోలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో పేగు కదలిక, మంచి జీర్ణ ఆరోగ్యానికి ప్రోత్సహిస్తుంది. ఇది మలబద్ధకం సమస్యలను దరిచేరనివ్వదు. మీ జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది.
4. పౌష్టికాహారం..
అవకాడో నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కరిగే విటమిన్స్ అంటే విటమిన్ ఏ, డీ, ఈ, కే. న్యూట్రియేంట్లు పుష్కలంగా ఉంటే ఫుడ్స్ తో అవకాడో నూనెతోపాటు తీసుకోవడం వల్ల జీవ లభ్యతను పెంచుతుంది.
5. బరువు నిర్వహణ..
ఇందులో ఉండే మోనోసాచురేటెడ్ ఫ్యాట్ వల్ల బరువు నిర్వహణ సాఫీగా సాగుతుంది. అవకాడో నూనె మన డైట్లో చేర్చుకోవడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. ఆకలి వేయదు. అంతేకాదు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది, రక్తంలో మెరుగైన చక్కెర నియంత్రణకు దారితీస్తుంది.
6. చర్మ ఆరోగ్యం..
అవకాడో నూనెలో విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం ల్ల స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. ఫ్రీ రాడికల్ సమస్య తగ్గి చర్మం మెరుస్తుంది. ఈ నూనెలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి స్కిన్ కేర్ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు.
7. కంటి ఆరోగ్యం..
అవకాడో నూనెలో లుటీన్, గ్జియాంథిన్ అనే రెండు యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యానికి ఎంతో మంచివి. వయస్సుతో పాటు వచ్చే కంటి సమస్యలను తగ్గిస్తాయి.
8. బ్రెయిన్..
అవకాడో నూనెలో ఉంటే మోనోసాచురేటెడ్ ఫ్యాట్ బ్రెయిన్ ఆరోగ్యకరమైన పనితీరుకు సహకరిస్తుంది. న్యూరోట్రాన్స్మీటర్ కు శక్తినిస్తుంది. ఇది మెమోరీ బూస్ట్ కు ప్రోత్సహిస్తుంది.
9. యాంటీ ఏజింగ్..
ఈ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల లక్షణాలు ఫ్రీ రాడికల్ సమతుల్యం చేస్తాయి. ఆక్సిడేటీవ్ స్ట్రెస్ తగ్గిస్తుంది. ఇలా ప్రతిరోజూ మీ డైట్లో అవకాడో నూనెను చేర్చుకుంటే వృద్ధాప్యాం ఆలస్యమవుతుంది. వయస్సు సంబంధిత స్కిన్ సమస్యలు రాకుండా నిరోధిస్తుంది.
10. బీపీ తగ్గుతుంది..
అవకాడో నూనెలో ఉండే ఒలీక్ యాసిడ్ వల్ల బీపీ లెవల్స్ తగ్గుతాయి. అంతేకాదు మీ సమతుల్య ఆహారంలో చేర్చుకోవడం వల్ల హైపర్ టెన్షన్ ను నిర్వహిస్తుంది. కార్డియోవాస్క్యూలర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఇదీ చదవండి: COPD: నడిస్తే ఆయాసం వస్తోందా? ఇలా చేస్తే లంగ్ కెపాసిటీ పెరుగుతుంది..
అవకాడోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా.. ఏదైనా మితంగా తింటేనే ఆరోగ్యం. ఎందుకంటే ఇందులో కేలరీలు అధికంగా ఉంటాయి. దీన్ని మీ డైట్లో చేర్చుకునే ముందు డాక్టర్ ను కలవడం మంచిది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook