Lemon Rice Recipe: ఏ పండుగలు వచ్చనా, హఠాత్తుగా ఏదైనా పిక్నిక్ వెళ్లాలన్నా లేకపోతే లంచ్‌ బాక్స్‌, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌ అయినా సరే పులిహోర ఉండాల్సిందే. ఇది త్వరగా అవుతుంది ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. అంతేకాదు పులిహోర పిల్లలకు కూడా ఎంతో ఇష్టం. పులిహోరను రెండు రకాలుగా వండుకుంటారు. చింతపండు, నిమ్మకాయ. అయితే,  ఇంకా ఎన్నో విధాలుగా కూడా వండుకుంటారు. కానీ, ఎక్కువ శాతం ఈ రెండు రకాల పులిహోరను ప్రతి ఇళ్లలో చేసుకుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పులిహోరను టెంపుల్‌ స్టైల్‌లో మీరు కూడా చేయాలనుకుంటున్నారా? దేవాలయాల్లో ప్రసాదంగా పెట్టే పులిహోర రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ రిసిపీని ఈసారి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఎలానో తెలుసుకోండి.


కావాల్సిన పదార్థాలు..
అన్నం - 2 కప్పులు
పచ్చిమిర్చి - 1
పసుపు - 1/2 tsp
పల్లీలు - 2 TSP
నిమ్మకాయలు-2
పచ్చిశనగపప్పు - 1 TSp
జీడిపప్పు - 10
ఉప్పు - రుచికి సరిపడా
ఆవాలు - 1/2 tsp
జీలకర్ర - 1 TSp
నూనె 
కరివేపాకు - 1 రెమ్మ


ఇదీ చదవండి:  ఈ మొక్కలు ఇంటికి చల్లదనాన్ని అందిస్తాయి..


నిమ్మకాయ పులిహోర తయారీ విధానం..
ముందుగా అన్నాన్ని ఎక్కువ మెత్తగా కాకుండా 90 శాతం వరకు ఉడికించుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ ప్యాన్‌ తీసుకుని అందులో నూనె వేసి వేడిచేసి జీలకర్ర, అవాలు వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులోనే పల్లీలు, శనగపప్పు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. 


ఇదీ చదవండి: మటన్‌ కుర్మా రిసిపీ.. ఈ రుచికరమైన కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది..


ఆ తర్వాత ఇందులో నిమ్మకాయ కూడా పిండుకోవాలి. అయితే, వెంటనే స్టవ్‌ ఆఫ్ చేసేయాలి. ఈ మిశ్రమాన్ని వండుకున్న అన్నంలోకి వేసుకోవాలి. ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. గుర్తుంచుకోండి నిమ్మరసం వేసిన తర్వాత ఎక్కువ సమయం స్టవ్ పై తాలింపు పెట్టరాదు. ఎందుకంటే రుచి మారిపోతుంది. పులిహోరను బాగా కలిపి పైనుంచి కాస్త గరిటెతో ఒత్తిడి చేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ రెండు నిమిషాలపాటు పక్కను పెట్టుకోవాలి. ఆ తర్వాత తింటే రుచికరమైన నిమ్మకాయ పులిహోర రెడీ.
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook