Mutton korma recipe: మటన్ కుర్మా రెసిపీని రుచికరంగా ఎలా వండుకోవాలో తెలుసుకుందాం. మటన్ అంటే చాలా మంది ఇండియన్స్ కి ఇష్టం దీన్ని డిన్నర్ టైంలో ఆస్వాదిస్తారు. ఇందులో రకరకాల మసాలలు వేసుకొని తయారు చేసుకుంటారు. అయితే ఈసారి రెస్టారెంట్ స్టైల్ మటన్ కుర్మాను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు..
మటన్ -1/2 కేజీ
ఉప్పు- రుచికి సరిపడా
పసుపు-1/2TBSP
నిమ్మరసం -3 TBSP
నానబెట్టిన గసగసాలు -3 TBSP
పెరుగు కూరకు తగినంత
స్పూన్ కారం -1/2TBSP
అల్లం -1/2 ఇంచు
ఉల్లిపాయ -ఒకటి
దాల్చిన చెక్క
యాలకులు -4
ఇదీ చదవండి: స్పైసీ హైదరాబాదీ చికెన్ గ్రేవీ... ఎలా తయారు చేయాలి?
తయారీ విధానం..
మటన్ కుర్మా తయారీకి ముందుగా మటన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. మటన్ పీసులను ఒక డీ పాన్ లో వేసుకొని అందులో కప్పు నీళ్లు కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టిన గసగసాలను పేస్ట్ తయారు చేసుకోవాలి.60 శాతం మటన్ ఉడికిన తర్వాత మంట ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో మసాలాలు వేయించుకోవాలి ఈ మసాలాలను మిక్సీ పట్టి మంచి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి ప్యాన్ తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద స్టవ్ ఆన్ చేసుకోవాలి.
ఇదీ చదవండి: అవిసెగింజలు- కలబంద మాస్క్‌తో జుట్టు స్ట్రెయిట్‌గా.. పొడుగ్గా పెరుగుతూనే ఉంటుంది..
ఈ మసాలాలు నీళ్లు పోసుకుని మటన్ పీసుల్లో వేసుకొని బాగా కలపాలి ఇప్పుడు ఇందులో మరికొంత ఉప్పు వేసుకొని పేస్ట్ కూడా వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి.
మంట తక్కువ పరిమాణంలో పెట్టుకొని ఇప్పుడు మసాలాలు వేసుకొని నల్ల మిరియాల పొడి కూడా వేసి ఉప్పు రుచి సరిచూసుకోవాల్సి ఉంటుంది. మటన్ 45 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ మటన్ కుర్మాను అల్లం కొత్తిమీర, నిమ్మరసంతో గార్నిష్ చేసుకోవాలి. వేడివేడిగా అన్నం, రోటిలోకి రుచిగా ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook