Red Cabbage Health Benefits: సాధారణంగా క్యాబేజీలో ఎక్కువగా నీటి శాతం ఉంటుంది. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే, మీరు మార్కెట్‌కు వెళ్లినప్పుడు రెడ్‌ క్యాబేజీ చూశారా? ఎప్పుడైనా కొని తెచ్చుకుని వండుకున్నారా? లేదంటే ఈరోజే కొనుగోలు చేసి తినండి దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇది చర్మానికి మాత్రమేకాదు ఆరోగ్యానికి కూడా మంచిది. ఎందుకంటే రెడ్ క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ఖనిజాల వల్ల మీ చర్మం ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది. క్యాబేజీ క్రూసీఫెరస్‌ జాతికి చెందిన కూరగాయ. దీంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం..
ఎర్ర క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ సీ, ఆంథోసైనిన్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్‌ సమస్య రాకుండా ఆక్సిడేటీవ్‌ నుంచి ఉపశమనం ఇస్తాయి. దీంతో మీ చర్మం నిత్యం యవ్వనంగా మెరిసిపోతుంది.


కొల్లాజెన్‌ ఉత్పత్తి..
రెడ్ క్యాబేజీలో విటమిన్‌ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్‌ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మానికి సాగే గుణాన్ని అందిస్తుంది. రెడ్ క్యాబేజీ డైట్లో చేర్చుకోండి చర్మం ఆరోగ్యంగా మారుతుంది. కొల్లాజెన్‌ ఉత్పత్తి పెరిగితే చర్మం నిత్య యవ్వనంగా కనిపిస్తుంది. ఇలాంటి ఆహారాలు తీసుకుంటే కొల్లాజెన్‌ ఉత్పత్తి పెరుగుతుంది.


ఇదీ చదవండి: ఒక్క టమాటా చాలు రక్తపోటుకు చెక్‌ పెట్టడానికి.. ఈ 5 విషయాలు తెలుసుకోండి..


యాంటీ ఇన్ల్ఫమేటరీ..
రెడ్ క్యాబేజీలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మంపై ఉండే దురదను తగ్గిస్తుంది. ఇందులో ఉండే బయోయాక్టీవ్‌ కంపౌండ్స్‌ యాక్నే, ఎగ్జీమా నుంచి ఉపశమనం ఇస్తుంది. ఇది చర్మ మంట సమస్యను తగ్గిస్తుంది. 


హైడ్రేషన్..
ఎర్ర క్యాబేజీలో నీరు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇది మన చర్మానికి రోజంతటికీ కావాల్సిన హైడ్రేషన్ అందిస్తుంది. ఇది శరీరం హైలోరోనిక్‌ యాసిడ్‌ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మం మాయిశ్చర్‌ గా ఉండటానికి ప్రేరేపిస్తుంది. ఈ మండు వేసవిలో రెడ్‌ క్యాబేజీ మీ డైట్లో చేర్చుకుంటే చర్మం కూడా జీవం కోల్పోదు. ఆరోగ్యానికి కూడా మంచిది.


ఇదీ చదవండి:  బిల్వపత్రం పరగడుపున తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో చూడండి..


కాంతివంతం..
రెడ్ క్యాబేజీలో ఉండే ఆంథోసైనీన్స్ ముఖానికి నేచురల్‌ గ్లో ఇస్తుంది. రెడ్‌ క్యాబేజీ తరచూ మీ డైట్లో చేర్చుకోవడం వల్ల జీవం కోల్పోయిన చర్మం, నల్ల మచ్చలు రాకుండా కాపాడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూనే మచ్చలేని ముఖం కూడా పొందవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి