Red Rice Millets Adai Recipe: దోశ అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరూ.. అందరూ లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దోసెను పోసుకుంటూ ఉంటారు. కొన్ని రాష్ట్రాల ప్రజలు పప్పుతో దోశలు వేసుకుంటే, మరి కొన్ని రాష్ట్రాల వారు మాత్రం బియ్యం పప్పు ఇతర తృణధాన్యాలతో దోశలను తయారు చేసుకుంటూ ఉంటారు. దోష నోటికి రుచి అందించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అందుకే ఎక్కువ మంది అల్పాహారంలో భాగంగా దోశ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే దోశ తిని తిని బోర్ కొడుతుందా ఈరోజు కొత్తగా మేము అందించే అడైలు రెసిపీని ట్రై చేయండి. దీనిని తయారు చేయడం చాలా సులభం.. అయితే తయారీ విధానం తెలుసుకుందామా?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అడైలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు..
8 ఎండుమిర్చి
❃ రెండు ఇంచుల అల్లం
❃ 12 వెల్లుల్లి రెబ్బలు
❃ తగినంత ఉప్పు 
❃ ఒకటి స్పూన్ సోంపు
❃ కావాల్సినంత నూనె
❃ రుబ్బుకోవడానికి కావాల్సిన నీరు
❃ ఒక ఉల్లిపాయ
❃ తగినంత ఉప్పు
❃ రాత్రంతా నానబెట్టిన ఒక కప్పు కందిపప్పు
❃ నానబెట్టిన రెడ్ రైస్
❃ రాత్రి నానబెట్టిన ఒక కప్పు కొర్రలు


తయారీ విధానం:
ముందుగా మిక్సీ గ్రైండర్ జార్ ను తీసుకోవాల్సి ఉంటుంది. అందులోనే నానబెట్టిన ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఒక టీ స్పూన్ సోంపు రాత్రంతా నానబెట్టిన కందిపప్పు ఒక ఇంచు అల్లం, ఆనియన్, తగినంత ఉప్పు, రెడ్ రైస్, నానబెట్టిన కొర్రెలను వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్ లోకి తీసుకొని అవసరమైతే అందులో నీటిని కలుపుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత స్టవ్ పై పెనాన్ని వేడి చేసి మీకు కావాల్సి ఉంటే పెనంపై గీ పూసుకొని కాస్త మందంగా అడైని పోసుకోవాల్సి ఉంటుంది. ఇలా పోసుకున్న తర్వాత తరుముకున్న వెల్లుల్లి తో పాటు పచ్చిమిర్చిని అడై పై వేసి కొద్దిసేపు కాలనివ్వాలి. 


Also Read Realme Narzo 60X 5G Price: బంఫర్‌ తగ్గింపు..5G ది బెస్ట్‌ Realme Narzo 60X మొబైల్‌ ఇప్పుడు కేవలం రూ.12,225కే..


ఆ తర్వాత దాని చుట్టూ కావాల్సినంత నెయ్యిని వేసుకొని మరి కొద్దిసేపు కాలనివ్వాలి. ఇలా కాలిన తర్వాత పై భాగాన్ని కూడా మీడియం ఫ్లేమ్ లో తిప్పి కాల్చాల్సి ఉంటుంది.  ఆ తర్వాత మరోవైపు నెయ్యిని పోసుకొని కూడా బాగా కాలనీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా కాలిన తర్వాత పల్లి చట్నీ లేదా మీకు నచ్చిన ఇతర చట్నీతో సర్వ్ చేసుకుని తినొచ్చు.


Also Read Realme Narzo 60X 5G Price: బంఫర్‌ తగ్గింపు..5G ది బెస్ట్‌ Realme Narzo 60X మొబైల్‌ ఇప్పుడు కేవలం రూ.12,225కే..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter