Dry Fruits For Reducing Bad Cholesterol: మనలో చాలామంది మన ఆహారపు అలవాట్ల గురించి చాలా అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా శరీరక శ్రమ కూడా చాలా మందిలో తగ్గిపోయింది. అయితే చాలా మంది వివిధ కారణాల వల్ల నూనె, తీపి పదార్థాలు తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఈ వ్యాధులేకాకుండా ధమనులలో అడ్డంకులు ఏర్పడతాయి. దీంతో తీవ్ర వ్యాధులేకాకుండా.. ప్రాణాంతకంగాను మారుతోంది. ముఖ్యంగా అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తినడం వల్ల  అధిక రక్తపోటు, గుండె పోటు సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కొన్ని ప్రత్యేకమైన డ్రై ఫ్రూట్స్ తీసుకోవాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఈ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందా..?:
పిస్తా చాలా ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్ ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. దీని తినడం వల్ల ఆకలిని తగ్గిస్తుంది. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తింటే చెడు కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది.


1. పిస్తా:


2. బాదం:


బాదంను ప్రతి రోజూ తింటే వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా నానబెట్టిన వాటిని బాదం తినడం వల్ల శరీరానికి అమైనో ఆమ్లాలు లభిస్తాయి. దీంతో రక్తంలో చక్కెర పరిమాణాలు తగ్గి.. కొలెస్ట్రాల్‌ కూడా తగ్గుతుంది.


3. వాల్‌నట్స్‌:


శరీరాన్ని ఫిట్‌గా ఉంచేందుకు వాల్‌నట్స్‌ సహాయపడుతాయి. అందుకే చాలా మంది బరువు తగ్గే క్రమంలో కూడా వాల్‌నట్స్‌ను విచ్చల విడిగా వినియోగిస్తారు. వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, మోనోశాచురేటెడ్ కొవ్వులు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ కూడా తగ్గుతుంది.


4. వేరుశెనగలు:


ఇతర డ్రై ఫ్రూట్స్‌తో పోలిస్తే.. వేరుశెనగలు శరీరానికి ప్రభావవంతంగా సహాయపడుతాయి. ఇందులో ఉండే పోషకాలు  కొలెస్ట్రాల్‌ తగ్గించి గుండె జబ్బుల నుంచి రక్షణ కలిగిస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారంలో వీటిని తీసుకోవాల్సి ఉంటుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read : Payal Ghosh : ఎన్టీఆర్ గురించి అప్పుడు చెబితే అంతా నవ్వారు.. పాయల్ ట్వీట్ వైరల్.. చెర్రీ ఫ్యాన్స్ ఫైర్


Also Read : Pooja Hegde Pics : అందుకే త్రివిక్రమ్ పాట రాయించుకున్నట్టున్నాడు.. పూజా హెగ్డే పిక్స్ వైరల



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe