Remedies For Cracked Heels: పగిలిన మడమల సమస్యలతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలను పాటించి విముక్తి పొందండి..!!
Remedies For Cracked Heels: ప్రస్తుతం చాలా మంది పగిలిన మడమల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. పగిలిన మడమలు ఎండా, వానా, ఏ సీజన్‌లోనైనా ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా ఎండాకాలం, వర్షాకాలంలో చాలా మందికి మడమలలో పగుళ్లు ఏర్పడతాయి.
Remedies For Cracked Heels: ప్రస్తుతం చాలా మంది పగిలిన మడమల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. పగిలిన మడమలు ఎండా, వానా, ఏ సీజన్‌లోనైనా ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా ఎండాకాలం, వర్షాకాలంలో చాలా మందికి మడమలలో పగుళ్లు ఏర్పడతాయి. ఇలా పగుళ్లు ఏర్పాడి తీవ్ర నొప్పులకు దారి తీస్తుంది. ఎండకాలంలో వచ్చే పగుళ్లకు ఇంటి చిట్కా సహాయంతో చికిత్స చేయవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇంటి నివారణలను చేసే క్రమంలో కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని వారు పేర్కొన్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కలబంద జెల్:
ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా మడమల పగుళ్ల సమస్యలతో బాధపడుతున్నారు. అటువంటి పరిస్థితులలో రాత్రి పడుకునే ముందు కలబంద జెల్ మడమలకు రాసుకోవాలి. ఈ జెల్ మడమలను మృదువుగా చేసి..సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది.
తేనె, అలోవెరా జెల్:
తేనె, అలోవెరా జెల్‌ను బాగా మిక్స్ చేసి కూడా మడమల పగుళ్లకు వాడవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. వీటిని సమాన పరిమాణంలో కలిపి చీలమండలపై రాస్తే మడమల పగుళ్ల సమస్య తగ్గుతుందని వారు చెబుతున్నారు.
సముద్రపు ఉప్పు:
చీలమండల పగుళ్ల సమస్యల నుంచి విముక్తి పొందడాని సముద్రపు ఉప్పు ఎంతగానో సహాయపడుతుంది. దీనిని నీటిలో మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని చీలమండల మీద అప్లై చేయాలి. దీని వల్ల మడమల పగిలిన సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
నిమ్మకాయ, పంచదార:
నిమ్మకాయ, పంచదార కలిపి చీలమండలను స్క్రబ్ చేయడం వల్ల మడమల పగుళ్ల సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా రాత్రి పడుకునే ముందు ఆవాలు, ఏదైనా నూనె రాసుకుంటే మడమల పగుళ్ల సమస్య తీరుతుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొన్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Bitter Gourd Benefits: కాకరకాయను వీరు అస్సలు తినకూడదు..తింటే దుష్ప్రభావాలు తప్పవు..!!
Also Read: Cholesterol Reduce Tips: కొలెస్ట్రాల్ నియంత్రణ కోసం..తప్పకుండా ఈ సూచనలను పాటించండి..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook