Rice Bugs: బియ్యం డబ్బాలో పురుగు పట్టిందా? ఈ చిన్ని చిట్కాతో ఎప్పటికీ రావు..
Rice Bugs Removing Tips: వంటింట్లో మనకు నిత్యం ఎదురయ్యే సమస్య. బియ్యం డబ్బాలో పురుగు పట్టడం. ఒక్కోసారి ఇతర పదార్థాలు పసుపు, కారంలో కూడా ఈ పురుగు చేరుతుంది. చాలామంది ఈ సమస్యతో బాధపడుతుంటారు. వాటికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.
Rice Bugs Removing Tips: మన వంటగదిలో సగం రోజు అక్కడే కేటాయిస్తాం. ఏ వంటకం చేసుకోవాలన్నా అదే మనకు ముఖ్యమైన ప్రదేశం. అయితే వంటగదిలో బియ్యం డబ్బా ను ఎంత కేర్ తీసుకున్న కానీ ఒక్కోసారి నల్ల పురుగులు చేరతాయి. ఇంకోసారి ఇతర పిండి పదార్థాలు పసుపు, కారం లోకి కూడా చేరతాయి. అయితే వీటితో పెద్ద తలనొప్పి అవుతుంది. చీకటిగా, చల్లగా ఉన్న ప్రదేశంలో ఈ పురుగులు త్వరగా వస్తాయి. అదేవిధంగా మన ఇంట్లో ఉండే బియ్యం డబ్బా లేదా బ్యాగులు కూడా వీటికి అనువైన స్థలం. అందుకే ఇక్కడ చేరి చికాకు కలిగిస్తాయి. అయితే ఇంట్లో బియ్యం డబ్బాలో పురుగు పట్టినప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలి... దీంతో అవి శాశ్వతంగా దూరం అవుతాయి.
బిర్యానీ ఆకు..
ఇది ప్రతి వంటగదిలో అందుబాటులో ఉంటుంది. మనం కూరల్లో బగారా అన్నం వండేటప్పుడు వినియోగిస్తాం. బిర్యానీ ఆకుతో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. బియ్యం డబ్బాలో ఈ బిర్యాని ఆకు వేసి పెట్టుబడి వల్ల పురుగులు చేరకుండా ఉంటాయి. బిర్యానీ ఆకు నుంచి వచ్చే ఆ వాసనను ఈ పురుగులు భరించలేవు... దీంతో ఆ చుట్టు ప్రదేశంలో ఉండకుండా పారిపోతాయి.
అలాగే లవంగం కూడా డబ్బాలో వేసి పెట్టడం వల్ల ఈ బగ్స్ రాకుండా ఉంటాయి. లవంగంలో వచ్చే ఒక వాసన అవి పురుగులకు నచ్చదు. దీంతో చుట్టూ ముట్టు ప్రదేశాలకు రావాలన్నా కూడా అవి భయపడతాయి.
కొందరు ఎక్కువ మొత్తంలో బియ్యం డబ్బాలలో నిలువ చేసుకుని పెట్టుకుంటారు. అయితే అప్పుడప్పుడు వాటిని తీసి ఎండలో ఆరబెట్టాలి. సూర్యుని యూవీ కిరణాలకు వేడికి కూడా ఈ పురుగులు వాటికి తాలూకు గుడ్లు నాశనం అయిపోతాయి. ఎందుకంటే ఈ పురుగులు ఎక్కువ శాతం నలుపు, చల్లని ప్రదేశాన్ని మాత్రమే అనువైనది. ఇలా వేడిగా ఉండే ప్రదేశంలో అవి ఉండలేవు. దీంతో పురుగుల డబ్బాలో చేరవు..
ఇదీ చదవండి: చలి వేళ ప్రోటీన్ పుష్కలంగా ఉండే 6 పండ్లు.. మీ డైట్ లో తప్పనిసరి..
పుదీనా ఆకులుని ఉపయోగించి కూడా తొలగించుకోవచ్చు. పురుగులకు ఈ పుదీనా వాసన కూడా పట్టదు బియ్యం నిల్వ చేసుకునే డబ్బా లేదా సంచుల్లో ఈ పుదీనా ఆకులను వేసి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువ రోజులు బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది. అందులో ఎలాంటి కెమికల్స్ వాడరు కాబట్టి ఇది న్యాచురల్ పద్ధతి
అంతేకాదు బియ్యాన్ని ఒక మూడు నాలుగు రోజులు పాటు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఆ ఎక్కువ చలి కూడా అవి ఉండలేవు పురుగులు చనిపోతాయి.. బియ్యం నిల్వ చేసుకున్న డబ్బాలో వెల్లుల్లి వేసి పెట్టడం వల్ల కూడా ఆ గాటు వాసనకు అవి త్వరగా పారిపోతాయి... వెల్లుల్లి వాసన వాటికి నచ్చదు. వెల్లుల్లి వాసన బియ్యం రుచిపై కూడా ఎలాంటి ప్రభావం చూపదు. కాబట్టి మన ఇంట్లో అందుబాటులో ఉంటుంది బియ్యం నిల్వ ఉన్న డబ్బాలో ఒక వెల్లుల్లి వేసి పెట్టడం వల్ల కూడా ఈ పురుగులు డబ్బాలో చేరకుండా ఉంటాయి.
ఇదీ చదవండి: చలి వేళ దోమల గోల.. ఈ మొక్కతో ఆమాడ దూరం పరార్..
వేపాకు..
ఇది మన భామ్మల కాలం నుంచి అనుసరిస్తున్న చిట్కా. వేప ఆకులను బియ్యం డబ్బాలో వేసి పెట్టడం వీటి వాసన కూడా ఆ పురుగులు చేరకుండా ఉంటాయి.. అయితే వేప ఆకులను తీసుకువచ్చి కడిగి శుభ్రం చేసి ఆరబెట్టాలి. వాటిని ఎండబెట్టిన తర్వాత ఈ బియ్యం డబ్బాలో వేసి పెట్టాలి. ఇది సులభమైన పద్ధతి ఎకో ఫ్రెండ్లీ కూడా.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.