Winter In Fruits: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఈ ఆరు పండ్లు మన డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ స్థాయులు బలపడతాయి. సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ పండ్లు మీ డైట్‌లో ఉన్నాయా? మరి..
జామకాయ..
ఈ సీజన్లో జామకాయ విపరీతంగా మార్కెట్లో కనిపిస్తుంది. వీటి ధర కూడా తక్కువే. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు జామకాయలు విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది... దీంతో సీజనల్ జబ్బులు మిమ్మల్ని చుట్టు ముట్టకుండా ఉంటాయి. జామ కాయ రుచికరంగా ఉండటంతో పాటు పోషకాల గని పవర్ఫుల్. డయాబెటిస్‌తో బాధపడే వారికి కూడా ఇది మేలు చేస్తుంది.
దానిమ్మ..
దానిమ్మ పండులో కూడా ఇమ్యూనిటీ పెంచే గుణాలు ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. చలికాలం దానిమ్మ పండు తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం కలుగుతుంది. అన్ని సీజన్లో దానిమ్మ పండు అందుబాటులో ఉంటుంది.
అవకాడో..
అవకాడో చూడ్డానికి క్రీమీ గా ఉంటుంది. పచ్చ రంగులో ఉండే ఈ పండు తీసుకోవటం వల్ల మంచి బలం కలుగుతుంది. చలికాలంలో ఇది మంచి సూపర్ ఫుడ్‌లా పనిచేస్తుంది. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని స్మూథీ రూపంలో నేరుగా కూడా తినవచ్చు. ఈ పండు తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.
సీతాఫలం..
సీతాఫలం తీపిగా ఉంటుంది ఈ చలికాలంలో విపరీతంగా అమ్ముడుపోతాయి. సీతాఫలంలో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇందులో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీ స్థాయులను బలపరిచే గుణాలు ఉంటాయి. సీతాఫలం డైట్ లో చేర్చుకోవడం వల్ల మంచి సూపర్ ఫుడ్‌లా పని చేస్తుంది.
ఇదీ చదవండి: టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..
ఖర్జూరం..
ఖర్జురంలో ఫైబర్, ప్రోటీన్ ఖనిజాల పుష్కలంగా ఉంటాయి. అన్ని సీజన్లను అందుబాటులో ఉండే ఖర్జూరం తీసుకోవటం వల్ల ఇది మంచి శక్తిని అందిస్తుంది. చలికాలం మాత్రమే కాదు అన్ని సీజన్లలో ఇది శక్తి అందిస్తుంది. ఖర్జూరం డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ...ముఖ్యంగా స్నాక్ రూపంలో తీసుకోవచ్చు వీటిని డెజర్ట్ లో కూడా వేసుకొని తినవచ్చు. ముఖ్యంగా ఖర్జూరం మహిళలకు వరం. ఇది ఐరన్ కంటెంట్ ను కలిగి ఉంటుంది. మహిళల్లో శక్తి పెంచుతుంది నీరసాన్ని తగ్గిస్తుంది.
ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..
స్ట్రాబెర్రీ..
స్ట్రాబెర్రీలో ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. చలికాలంలో మంచి సూపర్ ఫుడ్ స్ట్రాబెర్రీ అన్ని సీజన్లను అందుబాటులో ఉంటుంది... ఇది డయాబెటిస్ రోగులకు కూడా మేలు చేస్తుంది. చలికాలంలో స్ట్రాబెర్రీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ స్థాయులు బలపడతాయి. వీటిని చాక్లెట్ రూపంలో కూడా తీసుకోవచ్చు. స్ట్రాబెర్రీ జ్యూస్ లేదా స్మూథీల్లా కూడా తినవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.