Rid Gas Pain: పప్పు తిన్న వెంటనే గ్యాస్ ట్రబుల్ సమస్యలు వస్తున్నాయా? ఇలా చేస్తే చాలు!
How To Get Rid Of Gas Immediately: పప్పుతో తయారు చేసిన వంటకాలను అతిగా తినడం వల్ల చాలా మందిలో గ్యాస్ సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వాటిని వండుకునే క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
How To Get Rid Of Gas Immediately: బీన్స్, కాయధాన్యాల్లో అధిక పరిమాణంలో పోషకాలు లభిస్తాయని వీటిని విచ్చలవిడిగా తినేందుకు ఇష్టపడుతున్నారు. వీటిల్లో అమ్లత్వం కూడా లభిస్తుంది. కాబట్టి వీటిని అతిగా తీసుకోవడం కారణంగా గ్యాస్, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా నిపుణులు సూచించిన ఈ చిట్కాలు పాటించాల్సి ఉంటుంది..
బీన్స్, కాయధాన్యాలు తిన్నప్పుడు పొట్టలో గ్యాస్ రాకుండా ఉండడానికి వాటిని వండే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వీటిని వండే ఒక రోజు ముందు నీటిలో నానబెట్టి ఉదయాన్నే వండడం వల్ల పొట్టలో గ్యాస్ సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: How To Control Diabetes: ఈ మూలికలతో తీవ్ర మధుమేహం ఒక్కరోజులో దిగి రావడం ఖాయం!
ప్రస్తుతం చాలా మంది పప్పుతో తయారు చేసిన కూరలను తీసుకోవడం వల్ల కూడా పొట్టలో గ్యాస్ సమస్యల బారినపడుతున్నారు. దీని కారణంగా చాలా మందిలో కడుపు ఉబ్బరం సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా పప్పును వండుకునే క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఒక రోజు ముందే పప్పును నీటిలో నానబెట్టి తీసుకోవాల్సి ఉంటుంది.
ఎప్పటి నుంచో పొట్టలో గ్యాస్ సమస్యలతో బాధపడేవారు మొలకెత్తిన గింజలు, బీన్స్ పచ్చిగా తినడం మానుకోవాల్సి ఉంటుంది. తినాలనుకునేవారు వీటిని నీటిలో ఉడికించి తీసుకోవడం వల్ల పొట్టలో గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
కాయధాన్యాలు, పప్పులను వండుకునే క్రమంలో తప్పకుండా నెయ్యి, వెల్లుల్లి, అల్లం, ఇంగువలను తప్పకుండా వినియోగించాల్సి ఉంటుంది. వీటిని వినియోగించడం వల్ల పొట్ట సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
Also Read: How To Control Diabetes: ఈ మూలికలతో తీవ్ర మధుమేహం ఒక్కరోజులో దిగి రావడం ఖాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి