Rid Of Chapped Lips: పదే పదే పెదవులు పగులుతున్నాయా? ఇలా చేస్తే 5 నిమిషాల్లో మృదువుగా మారడం ఖాయం..
How To Get Rid Of Chapped Lips In 5 Minutes: ముఖం అందంగా ఉండేందుకు పెదవులు కూడా ఆరోగ్యంగా ఉండాలి. లేకపోతే ఫేస్ అంద హీనంగా తయారవుతుంది. కాబట్టి శీతాకాలంలో పెదవులనే సంరక్షించుకోవడం చాలా మంచిది. దీనిగ కోసం ఈ కింది చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది.
How To Get Rid Of Chapped Lips In 5 Minutes: శీతాకాలం కారణంగా చాలా మంది చర్మ వ్యాధులు, సీజనల్ వ్యాధులతో బాధపడుతారు. అయితే వాతావరణంలో తేమకు దూరంగా ఉండడం చాలా మేలు లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. చర్మ సంరక్షణతో పాటు పెదవుల సంరక్షణకు కూడా శరీరానికి చాలా మంచిది. ప్రస్తుతం చలి కాలం కారణంగా చాలా మందిలో పెదవుల పగుళ్లు సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కొన్ని ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఆ చిట్కాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
దీపికా పడుకోణె లాంటి పెదవులను పొందాలనుకుంటున్నారా..?:
చాలా మంది మహిళలు పెదవులను సంరక్షించుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బాలీవుడ్ నటి దీపికా పడుకోణె అనుసరించి ఇంటి చిట్కాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ చిట్కాలను అనుసరించడం వల్ల పెదవులు మెరుగ్గా మారడమేకాకుండా పెదవుల సమస్యలు కూడా తగ్గుతాయి.
పాలు:
పాలలో ఉండే మాయిశ్చరైజింగ్ లక్షణాలు మీ పెదాలను మృదువుగా మార్చడడానికి సహాయపడతాయి. పాలు, పసుపును మిశ్రమాన్నిపెదవులపై అప్లై చేస్తే అన్ని సమస్యలు కూడా తగ్గుతాయి. కాబట్టి పెదవుల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ మిశ్రమాన్ని పెదవులకు అప్లై చేయాల్సి ఉంటుంది.
తేనె:
తేనెలో క్రిమినాశక, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇది దెబ్బతిన్న కణాలను హైడ్రేట్ చేయడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. పగిలిన పెదాలను మృదువుగా చేయడానికి తేనె, చక్కెర స్క్రబ్ సహాయపడుతుంది.
టమాటో రసం:
టమాటో రసం చర్మానికే కాకుండా పెదవులకు కూడా ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు పెదవులను శుభ్రం చేసి చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
బాదం నూనె:
బాదం నూనెలో విటమిన్ ఇ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. కాబట్టి ఇది పెదవులకు అప్లై చేయడం వల్ల విటమిన్ సి వంటి ఇతర యాంటీఆక్సిడెంట్ల అందుతాయి. దీంతో పెదాలు మృదువుగా మారుతాయి. కాబట్టి పెదవుల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా దీనిని ప్రతి రోజూ వినియోగించాల్సి ఉంటుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Ponniyin Selvan 2 Release Date : పొన్నియిన్ సెల్వన్ రెండో పార్ట్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
Also Read : Thalapathy Vijay No 1 Hero : అందుకే విజయ్ నెంబర్ వన్ హీరో.. బల్లగుద్ది చెప్పేసిన దిల్ రాజు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి