ప్రకృతిలో లభించే వివిధ రకాల వస్తువులు లేదా పదార్ధాలతో సగం ఆరోగ్య సమస్యలకు పరిష్కారముంటుంది. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించేందుకు చర్మాన్ని రీఫ్రెష్ చేసేందుకు గులాబీ రేకులు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రకృతిలో లభించే కొన్ని వస్తువులతో సహజసిద్ధంగా చర్మాన్ని రీఫ్రెష్ చేయవచ్చు. అంతేకాదు..ముఖంపై కన్పించే ఆందోళన లేదా ఒత్తిడిని దూరం చేయవచ్చు. గులాబీలో యాంటీ ఏజీయింగ్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ చర్మానికి చాలా ప్రయోజనం చేకూరుస్తాయి. చర్మ సౌందర్యం, ముఖ్య సౌందర్యానికి అందుకే గులాబీ రేకులు తప్పకుండా వినియోగిస్తుంటారు. అయితే గులాబీ రేకులతో ఒత్తిడి కూడా దూరం చేయవచ్చని చాలామందికి తెలియదు. దీనికోసం రోజ్ పెటల్స్ స్క్రబ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. 


గులాబీలో ఉండే యాంటీ ఏజీయింగ్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో చర్మానికి చాలా మేలు కలుగుతుంది. అయితే గులాబీ రేకులతో ఒత్తిడిని జయించవచ్చని చాలామందికి తెలియదు. దీనికోసం రోజ్ పెటల్స్ స్క్రబ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. వీటితో స్నానం చేస్తే మీ టెన్షన్ పూర్తిగా దూరమౌతుంది. ఫ్రెష్‌నెస్ కలుగుతుంది.


రోజ్ బాత్ అనేది చర్మం పీహెచ్ స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. వీటితో మీ చర్మం చాలా అద్భుతంగా నరిష్ అవుతుంది. పింపుల్స్, డార్క్ సర్కిల్స్, స్వెల్లింగ్ వంటి చర్మ సంబంధిత సమస్యలు కూడా దూరమౌతాయి. అంతేకాకుండా...మీకు మృదువైన, గ్లోయింగ్ స్కిన్ లభిస్తుంది. రోజ్ పెటల్స్ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..


రోజ్ పెటల్స్ స్క్రబ్ తయారు చేసేందుకు కావల్సిన వస్తువులు


అరకప్పు బ్రౌన్ షుగర్
ఒక కప్పు కొబ్బరి నూనె
ఒక టేబుల్ స్పూన్ బాదం లేదా జోజోబా ఆయిల్ 
గులాబీ పూవు రెమ్మలు


రోజ్ పెటల్స్ స్క్రబ్ ఎలా చేయాలి


రోజ్ పెటల్స్ స్క్రబ్ తయారు చేసేందుకు ముందుగా జార్ ఒకటి తీసుకోవాలి. ఇందులో కొబ్బరి నూనె, గులాబీ రెమ్మలు వేయాలి. ఇందులో బ్రౌన్ షుగర్ కలపాలి. ఆ తరువాత ఇందులో బాదం లేదా జోజోబా ఆయిల్ కలపాలి. అన్నింటినీ కలిపి బాగా కలిపి సిద్ధంగా ఉంచుకోవాలి. ఎప్పుడు ఒత్తిడి కలిగినా బాత్ టబ్‌లో వేసి స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల టెన్షన్, స్ట్రెస్ దూరమౌతాయి. గులాబీ పరిమళం మిమ్మల్ని, మీ మనస్సును రిఫ్రెష్ చేస్తాయి. 


Also read: Jaggery Benefits: బెల్లం-శనగపప్పు కలిపి తింటే ఇన్నా లాభాలు ఉన్నాయా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook