Rose Water For Face: రోజ్ వాటర్ సాధారణంగా చర్మ సౌందర్యానికి వినియోగిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి చర్మ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ వాటర్‌  చర్మానికి వినియోగించాలని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. గులాబీ పువ్వులో ఉండే గుణాలు చర్మాన్ని శుభ్రంగా ఉంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు వంటకాల రుచిని పెంచడానికి కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది. కాబట్టి దీనిని వంటకాల్లో వినియోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోజ్ వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:


కాలేయ సమస్యల నుంచి ఉపశమనం:
ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది కాలేయం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం రోజ్‌ వాటర్‌ను ప్రతి రోజూ తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి.  కాలేయం దెబ్బతినే ప్రమాదం కూడా తగ్గుతుంది.


మెదడుకు మేలు చేస్తుంది:
రోజ్ వాటర్ అధిక టెన్షన్ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు ఒత్తిడిని తగ్గించి అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ వాటర్‌ను తాగాల్సి ఉంటుంది.


పొట్టకు మంచిది:
రోజ్ వాటర్ తాగడం వల్ల పొట్టకు చాలా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియను బలంగా చేస్తాయి. ఇందుకోసం రోజ్ వాటర్ తో తయారుచేసిన హెర్బల్ టీని రోజూ తాగవచ్చు.


గొంతు శుభ్రంగా మారుతుంది:
గొంతు నొప్పి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా రోజ్ వాటర్ తాగడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. రోజ్ వాటర్‌లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి గొంతు నొప్పి ఇతర అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Gas Cylinder Price: న్యూ ఇయర్ తొలి రోజే షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ ధరలు


Also Read: IND Vs SL: కొత్త ఏడాదిలో లంకేయులతో తొలి సమరం.. టీమిండియా తుది జట్టు ఇదే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook