IND Vs SL: కొత్త ఏడాదిలో లంకేయులతో తొలి సమరం.. టీమిండియా తుది జట్టు ఇదే..

IND Vs SL 1st T20 Team India Playing 11: కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించేందుకు టీమిండియా రెడీ అవుతోంది. హార్ధిక్ పాండ్యా నాయకత్వంలోని జట్టు శ్రీలంకతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడబోతుంది. ఈ నెల 3న తొలి మ్యాచ్ జరగబోతుంది. భారత తుది జట్టు ఎలా ఉండబోతుందంటే..?  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2023, 07:38 AM IST
  • ఈ నెల 3న శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్
  • శుభ్‌మన్‌ గిల్ అరంగేట్రం చేసే అవకాశం
  • టీమిండియా తుది జట్టు కూర్పు ఇలా..
IND Vs SL: కొత్త ఏడాదిలో లంకేయులతో తొలి సమరం.. టీమిండియా తుది జట్టు ఇదే..

IND Vs SL 1st T20 Team India Playing 11: టీమిండియా కొత్త సంవత్సరంలో శ్రీలంక టీ20 సిరీస్‌తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టబోతుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య ఈ నెల 3న తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌లో హార్దిక్ పాండ్యా టీమిండియాకు నాయకత్వం వహించనున్నాడు. ఈ సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి స్టార్ ఆటగాళ్లకు మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బోర్డు ఈ జట్టును ఎంపిక చేయగా.. హార్దిక్ పాండ్యా‌ పేరును టీ20 కెప్టెన్‌గా కూడా పరిశీలిస్తోంది. ఇక తొలి టీ20 మ్యాచ్‌ కోసం భారత తుది జట్టుపై కూర్పుపై అందరి దృష్టి నెలకొంది. పాండ్యా ఎవరికి ఛాన్స్ ఇస్తాడు..? ఎవరు అరంగేట్రం చేయనున్నారు..? ఓసారి పరిశీలిస్తే..

శుభ్‌మన్ గిల్ అరంగేట్రం 

టీమిండియా తరఫున టెస్టులు, వన్డేల్లో శుభ్‌మన్ గిల్ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనే ఈ యంగ్ ప్లేయర్‌కు అవకాశం దక్కుతుందని భావించగా.. నిరాశే ఎదురైంది. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో అంతర్జాతీయ టీ20లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్‌తో కలిసి గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించవచ్చు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ మూడో స్థానంలో ఆడవచ్చు. 

మిడిల్ ఆర్డర్ ఇలా..

గతేడాది అద్బుతమైన ఆటతీరు కనబర్చిన సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్‌లోనూ కీలకంగా మారనున్నాడు. ఈ నయా 360 నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. ఒకవేళ సూర్యకుమార్ వన్‌డౌన్‌లో వస్తే.. సంజూ శాంసన్ నాలుగోస్థానంలో ఆడతాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఆల్ రౌండర్ దీపక్ హుడా ఆ తరువాత ఆడనున్నారు. 

బౌలింగ్ కూర్పు ఇలా..

తొలి టీ20 మ్యాచ్‌కు టీమిండియా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో వెళ్లవచ్చు. ఫాస్ట్ బౌలింగ్‌లో ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్ తుదిజట్టులో ఉండే అవకాశం ఉంది. ఆల్ రౌండర్‌గా అక్షర్ పటేల్ లేదా వాషింగ్టన్ సుందర్‌ ప్లేయింగ్ ఎలెవెన్‌ ఉండే ఛాన్స్ ఉంది. లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ స్పిన్ బాధ్యతలను తీసుకోనున్నాడు.

శ్రీలంక టూర్‌కు భారత టీ20 జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, ముఖేష్ కుమార్.

తుది జట్టు ఇలా (అంచనా): శుభమాన్ గిల్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్/వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్.

Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. డీఏ పెంపుపై క్లారిటీ..!  

Also Read: Ysr Pension Kanuka: ఏపీలో ఇవాళ్టి నుంచి పెంచిన పింఛన్లు, 64 లక్షలమందికి పింఛన్లు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News