Seeds For Health: మారుతున్న జీవనశైలి కారణంగా అదంరూ హెల్తీగా, ఫిట్‌గా ఉండేదుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇటీవలే చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలను క్రమంగా తీసుకుంటున్నారని వీటి వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని నివేదికలు పేర్కొన్నాయి. ముఖ్యంగా చాలా మంది ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండడానికి పోషకాలున్న పండ్లను ఆహారంగా తీపుకుంటారు. వీటిని తినడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండకపోయినా.. వీటిలో ఉండే గింజల వల్ల సమస్యలు రావొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. కావున సన్‌ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, మెలోన్ సీడ్స్‌ను అతిగా తీసుకోవద్దు. వీటిల్లో హాని కలిగించే పదార్థాలుంటాయి. కావున శరీరానికి కూడా అనారోగ్య సమస్యలు తెచ్చిపెట్టే అవకాశాలున్నాయి. అయితే ఏ పండ్ల గింజలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీటిలో గింజలను అస్సలు తీసుకోవద్దు:


యాపిల్‌ పండ్లు:
యాపిల్‌ పండ్లను ప్రతి ఒక్కరూ ఇష్టపడుతూ తింటూ ఉంటారు. అయితే చాలా మంది ఈ పండ్లను తినే క్రమంలో గింజలను కూడా తింటున్నారు. ఇలా చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. యాపిల్ గింజల్లో సైనైడ్ ఉంటుంది. వీటిని అతిగా తింటే..  కడుపు తిమ్మిరి, వికారం, విరేచనాలకు దారి తీయోచ్చని నిపుణులు తెలుపుతున్నారు.


పియర్ Pear:
పియర్ గింజలు కూడా ఆపిల్ గింజల్లా ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఈ విత్తనాలలో ప్రాణాంతకమైన సైనైడ్ సమ్మేళనాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల కడుపు నొప్పి, వికారం, విరేచనాలు వచ్చే అవకాశాలున్నాయి. వీటిని ఎక్కువ మోతాదులో తినడం వల్ల విపరీతమైన చెమటలు పట్టడం, అలసట, కడుపులో తిమ్మిర్లు వచ్చే ప్రమాదం ఉంది.


చెర్రీ:
చెర్రీ చూడడానికి అందంగా ఉంటుంది.. అంతేకాకుండా తినడానికి కూడా చాలా రుచికరంగా ఉంటుంది. అయితే వీటిలో ఉండే విత్తనాలు కూడా చాలా ప్రమాదకరం. చెర్రీ గింజల్లో సైనైడ్ సమ్మేళనం అధిక పరిమాణంలో ఉంటాయి. దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కడుపులో తిమ్మిర్లు, విరేచనాలు వచ్చే అవకాశాలున్నాయి.
 
నేరేడు పండు:
నేరేడు గింజలు ఆరోగ్యానికి విషం వంటివి.. ఈ విత్తనాలలో సైనోజెనిక్ గ్లైకోసైడ్స్, అమిగ్డాలన్స్ అనే టాక్సిన్స్ ఉంటాయి. వీటిని ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల శరీరంలో బలహీనతగా ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ విత్తనాలను ఎక్కువ పరిమాణంలో తింటే కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదముందని నిపుణులు తెలుపుతున్నారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Naga Chaitanya: ప్రేయసితో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికేసిన నాగచైతన్య !


Also Read: Happy Independence Day: రేపే భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవం.. ఇండిపెండెన్స్ డే కొటేషన్స్, విషెస్, స్టేటస్‌లు మీకోసం 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook