Weight loss Drink: అధిక బరువుతో బాధపడుతున్నారా..3-4 వారాల్లోనే బరువు తగ్గించుకోవాలా..అలా అయితే ఈ చిట్కా పాటిస్తే మీరు ఊహించినట్టే అవుతుంది. అధిక బరువుకు చెక్ పెట్టే ఆ చిట్కా ఇప్పుడు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలంటే తిండి, నీరు కూడా ఆరోగ్యంగా ఉండటం అవసరం. తినే ఆహారంలో సమస్య ఉంటే వివిధ రకాల రోగాలు చుట్టుముడతాయి. అందుకే ఆయుర్వేద శాస్త్రంలో అద్భుతమైన చిట్కా వైద్యం అందుబాటులో ఉంది. ఈ చిట్కా పాటిస్తే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా...చాలా వేగంగా బరువు తగ్గించుకోవచ్చు. కేవలం పసుపు, నిమ్మకాయ, అల్లం సహాయంతో అధిక బరువు సమస్య నుంచి విముక్తులు కావచ్చు. ఆరోగ్యపరమైన ప్రయోజనాలు పొందవచ్చు. పసుపు, అల్లం, నిమ్మకాయల్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఎంతకాలంలో బరువు తగ్గవచ్చో తెలుసుకుందాం..


పసుపు, నిమ్మకాయ, అల్లం ప్రయోజనాలు


ఆరోగ్యంగా ఉండేందుకు, వివిధ రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షించుకునేందుకు ఇమ్యూనిటీ బలంగా ఉండటం చాలా అవసరం. దీనికోసం పసుపు, నిమ్మకాయ, అల్లం నీరు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. మీ ఇమ్యూనిటీని పెంచుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటే..పసుపు బెస్ట్ యాంటీ బయోటిక్ గుణాలు కలిగి ఉంది. అందుకే రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.


కిడ్నీ, లివర్‌కు ప్రయోజనం


లివర్, కిడ్నీ సంబంధిత సమస్యల్నించి విముక్తి పొందాలంటే అల్లం, పసుపు, నిమ్మకాయ నీళ్లను సేవించాలి. ఎందుకంటే లివర్, కిడ్నీల్నించి విష పదార్ధాల్ని తొలగించడంలో ఈ మూడూ కీలకంగా ఉపయోగపడతాయి. ఈ మూడూ లివర్‌ను డీటాక్సిఫై చేస్తాయి. ప్రతిరోజూ ఉదయం ఈ మూడింటి మిశ్రమం తీసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయి.


3-4 వారాల్లో అధిక బరువుకు చెక్


బరువు తగ్గించేందుకు అల్లం, నిమ్మకాయ, పసుపు నీరు అద్భుతంగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా 3-4 వారాల్లోనే వేగంగా బరువు తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. బరువు తగ్గడంలో ఉపయోగపడతాయి. ఈ మూడింటి మిశ్రమంలో హెల్త్ డ్రింక్ తయారు చేసేందుకు ముందుగా..గ్లాసు నీళ్లలో ఒక అల్లం ముక్క వేసి బాగా ఉడకబెట్టాలి. తరువాత ఇందులో ఒక స్పూన్ నిమ్మరసం, అర స్పూన్ పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత టీ లేదా కాఫీ తాగినట్టు తాగేయాలి. ఇలా ప్రతిరోజూ పరగడుపున చేస్తే కేవలం 3-4 వారాల్లోనే బరువు తగ్గుతారు. 


Also read: Heart Health: ఈ లక్షణాల్ని బట్టి మీ గుండె ఎలా ఉందో చెప్పేయవచ్చు, నిర్లక్ష్యం చేయకూడదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook