Heart Health: శరీరంలోని అన్ని అంగాల్లో గుండె చాలా కీలకమైంది. అది కొట్టుకున్నంతసేపే ప్రాణం ఉంటుంది. అందుకే హార్ట్‌కేర్ అనేది చాలా ముఖ్యం. మీ గుండెకు అనారోగ్యమైతే..ఈ లక్షణాలు కన్పిస్తాయి. ఆ లక్షణాలు ఏంటనేది చూద్దాం.
గుండెను ఆరోగ్యంగా ఉంచితే పదికాలాలపాటు పదిలంగా ఉంటాం. గుండె లబ్‌డబ్ ధ్వని ఆగనంతవరకే మనం ప్రాణాలతో ఉంటాం. గుండె ఆరోగ్యంగా ఉంటే ఏ విధమైన సమస్యలుండవు. గుండెకు ఏ మాత్రం అనారోగ్యమైనా సరే మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని లక్షణాలన్ని బట్టి గుండె అనారోగ్యాన్ని అంచనా వేయవచ్చు. ఛాతీలో నొప్పి, అలసట, చెమట్లు పట్టడం వంటి లక్షణాలు కన్పిస్తే..నిర్లక్ష్యం చేయకూడదు. గుండె అనారోగ్యంతో ముడిపడి ఉన్న ఆ లక్షణాలేంటో తెలుసుకుందాం..
ఛాతీలో అలజడి
ఛాతీలో నొప్పి అనేది గుండె సమస్యలో ప్రధానమైన లక్షణం. ఛాతీలో నొప్పి, పట్టేసినట్టుండటం, భారంగా ఉండటం అనేవి గుండెపోటు వచ్చే ముందు కన్పించే ముఖ్యమైన లక్షణాలు. అయితే ఛాతీ నొప్పి లేకుండా కూడా గుండెపోటు వస్తుంటుంది. మరోవైపు తీవ్రమైన అలసట, కడుపులో నొప్పి, అజీర్ణం వంటివి కన్పించినా గుండెపోటు ముప్పు పొంచి ఉన్నట్టు అర్ధం. వాంతులు కూడా గుండె సంబంధిత సమస్యలున్నప్పుడు కన్పించే ప్రధాన లక్షణం. అందుకే ఈ లక్షణాలు కన్పించినప్పుడు ఏ విధంగానూ నిర్లక్ష్యం చేయకూడదు.
శరీరపు ఎడమచేతి భాగంలో నొప్పి ఉండటం గుండె సంబంధిత సమస్యకు ప్రధాన లక్షణం. ఈ క్రమంలో నొప్పి అనేది ఛాతీతోనే ప్రారంభమౌతుంది. ఆ తరువాత కిందికి నొప్పి పెరుగుతుంది. గుండె పోటుకు, గుండె అనారోగ్యానికి ఇదొక ముఖ్యమైన లక్షణం. ఇక మరో ముఖ్యమైన లక్షణం తల తిరగడం. డీహైడ్రేషన్ ఉన్నప్పుడు కూడా ఈ సమస్య ఎదురౌతుంది. కానీ గుండె ఆరోగ్యం పాడైతే ఈ లక్షణం తప్పకుండా కన్పిస్తుంది.
Also read: Mens Health Tips: పురుషుల శారీరక బలహీనత దూరం చేసే అద్భుత ఔషధం ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook