చర్మ సంరక్షణ, ముఖ సౌందర్యం కోసం చాలామంది మీగడ రాస్తుంటారు. దీనివల్ల ప్రయోజనాలు ఉన్నా..దీర్ఘకాలంలో నష్టాలే ఎక్కువంటున్నారు ఆరోగ్య నిపుణులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందం, నిగనిగలాడే చర్మం కోసం  వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఖరీదైన బ్యూటీ ఉత్పత్తులతో పాటు చిట్కాలు కూడా వినియోగిస్తుంటారు. చర్మం అందాన్ని పెంచేందుకు చాలామంది మీగడ రాస్తుంటారు. పోషకాలతో నిండి ఉండే మీగడతో చర్మం నిగనిగలాడుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్, ఫ్యాట్ చర్మాన్ని మృదువుగా, మెరిసేట్టు చేస్తాయి. చర్మం డ్రైనెస్ దూరమౌతుంది. అయితే మీగడతో ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. మీగడ రోజూ రాయడం వల్ల కలిగే నష్టాలేంటో చూద్దాం.


మీగడ రాయడం వల్ల పింపుల్స్ సమస్య ఉత్పన్నం కావచ్చు. ముందు నుంచే పింపుల్స్ ఉంటే ముఖంపై మీగడ రాయకూడదు. ఎందుకంటే మీగడ అనేది చర్మం పోర్స్‌ను బ్లాక్ చేస్తుంది. ముఖంపై దుమ్ము ధూళి పేరుకుపోతుంది. ఫలితంగా యాక్నే సమస్య పెరుగుతుంది.


ముఖంపై మీగడ రాయడం వల్ల దురద, మంట వంటి సమస్య పెరుగుతుంది. చర్మం సెన్సిటివ్‌గా ఉండేవాళ్లు కూడా మీగడ రాయకూడదు. ముఖ్యంగా ముఖంపై రాయకుండా ఉండాలి. ముఖంపై మీగడ రాయడం వల్ల ప్యాచీ స్కిన్ సమస్య తలెత్తుతుంది. ముఖ్యంగా మీగడ రాసిన తరువాత ఎండలో ఎక్స్‌పోజ్ కాకూడదు. లేకపోతే ట్యానింగ్ సమస్య ఏర్పడుతుంది.


Also read: Weight loss Drink: హోమ్ మేడ్ డ్రింక్స్‌తో 3 వారాల్లో స్థూలకాయం, బెల్లీ ఫ్యాట్‌కు చెక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook