స్థూలకాయం లేదా అధిక బరువు ఇటీవలి కాలంలో ప్రధాన సమస్యగా మారింది. ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, నిద్ర లేమి వంటివి ఇందుకు కారణాలుగా ఉన్నాయి. అయితే హోమ్ మేడ్ డ్రింక్‌తో సులభంగా అధిక బరువు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
అధిక బరువు సమస్య నుంచి విముక్తి పొందేందుకు ఒక్కోసారి డైటింగ్ లేదా వ్యాయామం కూడా పరిష్కారం చూపించదు. పండుగల సందర్భంలో తినే వివిధ రకాల పదార్ధాలతో డైట్ ప్లాన్ చెడిపోతుంటుంది. ఫలితంగా శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. ఈ పరిస్థితుల్లో కొన్ని రకాల డ్రింక్స్‌తో బరువు తగ్గించుకోవడమే కాకుండా..కొవ్వును కరిగించవచ్చు.
కొవ్వును తొలగించేందుకు గ్రీన్ యాపిల్ డ్రింక్ మంచి ఫలితాలనిస్తుంది. దీనికోసం గ్రీన్ యాపిల్‌తో పాటు వాము, అరటి పండు, కీరా, పుదీనా అవసరమౌతాయి. ఈ నాలుగు పదార్ధాల్ని కలిపి మిక్సర్ చేసుకోవాలి. ఇందులో నీళ్లు కలిపి వడపోయాలి. కొద్దిగా నిమ్మరసం, నల్ల మిరియాల పౌడర్ వేసుకుని తాగితే మంచి ఫలితాలుంటాయి.
నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. నిమ్మకాయతో డీటాక్స్ డ్రింక్స్ చేసేందుకు యాపిల్, దోసకాయ కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇందులో నీల్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని జ్యూస్‌గా చేసుకుని రోజూ ఉదయం పరగడుపున తీసుకంటే బాడీ మొత్తం డీటాక్స్ అవుతుంది. శరీరంలో పేరుకుపోయే కొవ్వు దూరమౌతుంది.
క్యారట్, పైనాపిల్ కలిపి కూడా డ్రింక్ తయారు చేసుకోవచ్చు. క్యారట్, పైనాపిల్‌ను చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని బ్లెండర్లో వేసి జ్యూస్ చేసుకోవాలి. కొద్దిగా అల్లం వేసుకుంటే మంచిది. అల్లం, పైనాపిల్, క్యారట్ మూడింటి మిశ్రమం కొవ్వు కరిగించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.
కొబ్బరి నీళ్లలో ఉండే పోషకాలు స్థూలకాయం తగ్గించేందుకు దోహదపడతాయి. కొబ్బరి నీళ్లను పుదీనా ఆకుల రసంతో కలిపి జ్యూస్ చేసుకోవాలి. ఉదయం పరగడుపున తాగితే బరువు తగ్గుతారు.
Also read: Cucumber Benefits: మీ బ్లడ్ షుగర్ లెవెల్ నియంత్రణకు ఆ ఒక్కటీ చాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook