Skin Care Treatment: ఆరోగ్యమైన, కాంతివంతమైన చర్మం కోసం..ఇంట్లోనే ఫేస్‌ప్యాక్ తయారీ
Skin Care Treatment: వర్షాకాలంలో చర్మ సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మ సంరక్షణకై ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన ఫలితాలు ఉండవు. ఆరోగ్యమైన కాంతివంతమైన చర్మం కోసం ఇలా చేస్తే చాలు..అద్భుత ఫలితాలుంటాయి..
Skin Care Treatment: వర్షాకాలంలో చర్మ సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మ సంరక్షణకై ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన ఫలితాలు ఉండవు. ఆరోగ్యమైన కాంతివంతమైన చర్మం కోసం ఇలా చేస్తే చాలు..అద్భుత ఫలితాలుంటాయి..
ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా చాలామందికి చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. కొంతమంది డ్రై స్కిన్, నిర్జీవమైన చర్మంతో ఇబ్బంది పడుతుంటారు. కాలుష్యం, కెమికల్స్ సహిత మేకప్ ఉత్పత్తులు మీ ముఖం అందాన్ని మరింతగా పాడు చేస్తుంటాయి. ప్రస్తుతమైతే..తక్కువ వయస్సుకే చర్మం ముడతలు పడిపోతోంది. ఫలితంగా యౌవనంలోనే వృద్ధాప్య లక్షణాలు కన్పిస్తున్నాయి. కొన్నిసార్లు పింపుల్స్ సమస్య వేధిస్తుంటుంది. ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్‌తో కూడా సమస్య దూరం కాక ఇబ్బంది పడుతుంటారు. అయితే కొన్ని సులభమైన హోమ్ రెమిడీస్ చిట్కాలతో ఈ సమస్యల్నించి దూరం కావచ్చు. ముఖ్యంగా అల్లోవెరా, పసుపు, పెరుగు ఫేస్‌ప్యాక్ అద్భుత ఫలితాలనిస్తుంది.
ఆయర్వేదంలో ప్రకృతిలో లభించే వివిధ వస్తువులతో చర్మాన్ని సుందరంగా, కాంతివంతంగా మార్చుకునే పద్ధతులు చాలా ఉన్నాయి. పసుపు, అల్లోవెరా, పెరుగులో ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ మూడింటినీ కలిపిన మిశ్రమంతో చర్మ సంబంధిత సమస్యలు దూరం చేయవచ్చు.
ఫేస్‌ప్యాక్ తయారీ, ఎలా రాసుకోవాలి
కొద్దిగా అల్లోవెరా జెల్ తీసుకుని..అందులో అదే తగిన మోతాదులో పసుపు కలుపుకోవాలి. పసుపు, అల్లోవెరా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుుడ ఇందులో తగినంత పెరుగు వేసి మళ్లీ కలపాలి. లిప్ క్రీమ్‌లా బాగా కలపాలి. ముందు ముఖాన్ని శుభ్రంగా నీళ్లతో కడగాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని స్పూన్‌తో కలుపుకుంటూ..కాటన్ సహాయంతో ముఖం, మెడపై బాగా రాయాలి. ఓ 20-30 నిమిషాలుంచిన తరువాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
పసుపు, పెరుగు, అల్లోవెరాలు చర్మాన్ని టైట్ చేస్తాయి. ఫలితంగా ముఖంపై ముడతలు తొలగిపోతాయి. అదే సమయంలో ఈ ఫేస్‌ప్యాక్ యాంటీ ఏజీయింగ్‌లా పనిచేస్తుంది. పెరుగులో ఉండే ల్యాక్టోస్ చర్మానికి నిగారింపు తీసుకొస్తుంది. డ్రైస్కిన్ సమస్యను నిర్మూలిస్తుంది. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ముఖానికి హాని కల్గించే బ్యాక్టీరియాను అంతం చేస్తాయి. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మ కణాల్ని క్లీన్ చేస్తాయి.
ఈ ఫేస్‌ప్యాక్ సహాయంతో పింపుల్స్ కూడా తొలగించవచ్చు. ఇందులో ఉండే పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పింపుల్స్‌కు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తాయి. ఈ ఫేస్‌ప్యాక్‌లో మెలోనిన్ నియంత్రించే శక్తి ఉంటుంది. ఫలితంగా ముఖానికి నిగారింపు వస్తుంది.
Also read: Eye Care Diet: మీ రెగ్యులర్ డైట్‌లో ఈ పదార్ధాలు చేరిస్తే..కంటి వెలుగు పెరగడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook