Skin Care Tips: నిమ్మరసంతో ప్రయోజనాలేంటి, ముఖంపై నేరుగా రాస్తే ఏమౌతుంది
Skin Care Tips: ముఖంపై నిగారింపు, మచ్చలు, మరకలు నిర్మూలించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. నిమ్మకాయ ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం. అయితే ఎలా రాయాలి, కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
Skin Care Tips: ముఖంపై నిగారింపు, మచ్చలు, మరకలు నిర్మూలించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. నిమ్మకాయ ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం. అయితే ఎలా రాయాలి, కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
చాలా సమస్యలకు చిన్న చిన్న చిట్కాలతోనే అద్భుతమైన పరిష్కారముంటుంది. అందులో ఒకటి ముఖంపై మచ్చలు, మరకల నిర్మూలనకు, నిగారింపు కోసం నిమ్మకాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయ చర్మానికి చాలా ప్రయోజనకరం. నిమ్మకాయలో పుష్కలంగా ఉండే విటమిన్ సి కారణంగా ఆరోగ్యపరమైన లాభాలు చాలా ఉన్నాయి. ముఖ అందాన్ని పెంచేందుకు నిమ్మకాయతో ఫేస్‌మాస్క్ వేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. అయితే నిమ్మకాయను ఎప్పుడూ ముఖంపై నేరుగా రాయకూడదు. దీనివల్ల చాలా దుష్పరిణామాలుంటాయి. అందుకే ముఖంపై నిమ్మకాయను ఎలా అప్లై చేయాలో ముందుగా తెలుసుకుందాం..
మచ్చలు మరకలు తొలగించేందుకు నిమ్మకాయ అద్బుతంగా ఉపయోగపడుతుంది. వారంలో 2-3 సార్లు వాడవచ్చు. అంతేకాదు నిమ్మరసంతో సన్‌ట్యాన్, ముడతలు కూడా తొలగిపోతాయి. ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్లకు నిమ్మరసం చాలా లాభదాయకం. వారంలో 3 సార్లు నిమ్మరసం రాసుకోవాలి. దీనివల్ల ముఖంపై గ్లో పెరుగుతుంది.
నిమ్మరసం ముఖానికి రాసుకోవడం వల్ల పింపుల్స్, యాక్నే సమస్య దూరమౌతుంది. నిమ్మలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ముఖంపై యాక్నే, పింపుల్స్ సమస్యను తగ్గిస్తాయి. అంతేకాకుండా నిమ్మరసంతో కొబ్బరి నూనె లేదా టీ ట్రీ ఆయిల్ కలిపి రాస్తే పింపుల్స్, యాక్నే దూరమౌతాయి.
నిమ్మరసం ఎలా అప్లై చేయాలి
ముఖానికి నిమ్మరసాన్ని నేరుగా రాయడం వల్ల హాని చేకూరే అవకాశాలున్నాయి. అందుకే ఎప్పుడూ నిమ్మరసాన్ని కొన్ని ఇతర వస్తువులతో కలిపి రాయాలి. దీనికోసం ఒక స్పూన్ నిమ్మరసంలో ఒక స్పూన్ అలోవెరా జెల్ కలిపి..ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. లేదా నిమ్మరసంలో కొబ్బరి నూనె కలిపి రాసుకోవచ్చు.
Also read: Weight Loss Tips: ఈ నియమాలు పాటిస్తే కేవలం 5 రోజుల్లోనే బరువు తగ్గొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook