Pimples Cause Foods: మొటిమల సమస్య ఎక్కువగా ఉందా..?? అయితే వీటిని తినకండి
మొటిమలు ఎక్కువగా అవుతున్నాయా..?? అయితే మీరు తినే ఫుడ్ లో ఇవి ఉన్నాయేమో ఒకసారి చూసుకోండి..? వీటి వల్లనే మొటిమలు ఎక్కువగా వస్తాయని పరిశోధనల్లో తేలింది.
Pimples Cause Foods: కేవలం తినే ఆహారం వల్లనే మొటిమలు కలుగుతాయనేది అవాస్తవం... కానీ ఇది కొంతవరకు మాత్రమే వాస్తవం. 2002 సం.లో ఆర్చీవ్స్ ఆఫ్ డెర్మటాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం కొన్ని ఆహార పదార్థాలు మొటిమలకి కారణమవుతాయని రుజువు చేయబడింది. శుద్ధి చేసిన పిండి పదార్థాలు తినడం వలన ఇన్సులిన్ స్థాయి పెరిగి సిబం ఉత్పత్తి పెరుగుతుంది మరియు స్వేధ రంధ్రాలకి అడ్డుపడుతుంది.
కావున, ఆహరం వలన మొటిమలు వస్తాయనేది అపోహ కాదని తెలుసుకోవాలి. అలాగే మొటిమలు కలిగించే ఆహారం గురించి కూడా తెలుసుకోవాలి.
చాక్లెట్
చాక్లెట్ లో ఎక్కువ శాతం చక్కెర ఉంటుంది. అందువలన సిబం యొక్క ఉత్పత్తి పెరిగి, శరీరంలో తాపజనక ప్రతిస్పందనకి కారణమవుతుంది. డార్క్ చాక్లెట్ కంటే, పాలు మరియు వైట్ చాక్లెట్ లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. మొటిమలు రాకుండా ఉండాలంటే చాక్లెట్ తినడం తగ్గించుకోవాలి.
Also Read: Avneet Kaur: బంటి.. నీ సబ్బు స్లోఆ ఏంటి..?? యాడ్‌లో పాప ఇప్పుడెలా ఉందో తెలుసా..??
స్పైసీ ఫుడ్
దుకాణాలలో దొరికే సాస్ తో చేసిన స్పైసీ ఫుడ్ వలన చర్మం పై ఎక్కువగా ప్రభావం ఉంటుంది. మిరియాలతో తాజాగా ఇంట్లోనే తయారు చేసే మిర్చి సాస్ అంతగా ప్రభావం చూపించదు. ఘాటుగా ఉన్న ఆహారం వలన మొటిమలు రావడంలో ఎక్కువగా వాస్తవం లేకపోయినా, ఏ ఆహార నిపుణుడిని అడిగిన ఘాటైన ఆహరం మొటిమలకి కారణమని చెప్తారు.
జున్ను
2005 సం.లో జర్నల్ ఆఫ్ ద అమెరికన్ అకాడెమి ఆఫ్ డెర్మటాలజీ వ్యాసం ప్రకారం 47,355 మంది మహిళలపై చేసిన పరిశోధన ప్రకారం పాలు మరియు పాల ఉత్పత్తుల (జున్ను, వెన్న, తక్షణ అల్పాహార పానీయాలు మరియు కాటేజ్ జున్ను) వలన మొటిమలు లేక చర్మం పై పగుళ్ళు సంభవిస్తాయని తెలిపారు. కావున, జున్నుతో చేయబడిన బేకరీ ఉత్పత్తులని తినకూడదని గుర్తుంచుకోవాలి.
పప్పులు
చాల మంది పప్పులు మరియు పప్పులతో చేసిన వంటలు, ముఖ్యంగా వేరుశనగ పప్పుతో ఉన్న జున్ను తినడం మానేస్తే మొటిమలు కలగవు అని అనుకుంటారు. కాని అది అందరి విషయంలో వాస్తవం కాదు. కానీ ఇది మీ వరకు వాస్తవం అని తెలుసుకోవాలంటే పప్పు వంటకాలు తినడడం తగ్గించాల్సిందే.
Also Read: India Vs Pakistan: 'షమీ నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపో అంటూ'.. బూతులు తిడుతున్న నెటిజన్లు
సుశి
అవాక్కయ్యారా? మేము కూడా నమ్మలేకపోయము. కానీ నమ్మండి, సుశి రోల్స్, లేక సుశితో చేసిన సలాడ్స్ మరియు స్పైరులిన్ కలపబడిన ఆహార పదార్థాలలో ఎక్కువగా అయోడైడ్ లు ఉంటాయి. ఈ అయోడైడ్ ల వలన ఒక వారం రోజుల్లోనే విపరీతమైన మొటిమలు వస్తాయి.
పాలు
జున్నులో చెప్పిన ప్రకారం పాల వలన కూడా మొటిమలు కలుగుతాయి, కాని జున్ను అనేది ఒక పాల ఉత్పత్తికి సంబందించినది. 4,273 మంది యుక్త వయసులో ఉన్న అబ్బాయిలలో చేసిన పరిశోధనలో పాల వలన మొటిమలు కలుగుతాయని తేలింది. ఎందుకంటే, మనం తాగే పాలు గర్భం దాల్చిన ఆవుల నుంచి వచ్చినవి. వాటిలో ఎక్కువగా హార్మోన్లు ఉండడం వలన స్వేధ గ్రంధాలని అలసిపోయేలా చేస్తాయి. కావున పాలు, మొటిమలు పుట్టించడంలో ఒక ముఖ్య కారణం అవుతుంది.
Also Read: Venu Swami Comments on Rakul: వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు.. రకుల్ ఎంగేజ్మెంట్ ఆగిపోనుందట..!!
ఫ్రెంచ్ ఫ్రైస్
నిజమే, మీకు వీటి గురించి తెలిసిన తినకుండా ఉండలేరు. వాస్తవం ఏమిటంటే, ఆలుగడ్డ ముక్కలను డీప్ ఫ్రీ చేసే వీటి వలన చర్మం యొక్క పగుళ్ళకి కారణమవుతుంది. ఈ చెడు ప్రభావం కలగడానికి సరైన కారణం తెలుసుకోవడానికి చాల పరిశోధనలు చేస్తున్నారు.
సోడా
సోడాలో ఎక్కువగా శుద్ధి చేయబడిన చక్కెర ఉంటుంది. ఇలాంటి పదార్థాలు తినడం లేక త్రాగడం వలన రక్తంలో చక్కెర మరియు క్రొవ్వు శాతం పెరుగుతుంది. దీనికి శరీరం తట్టుకోలేక రక్తంలోని చక్కెర నుంచి ఇన్సులిన్ మరియు టెస్టోస్టెరాన్ విడుదల అవుతాయి. దాని వలన చర్మం పై మంటగా ఉండి, స్వేధ గ్రంధాలు ముసివేయబడతాయి.
ఇలాంటి ఆహార పదార్థాలే అందరిలో సమానంగా మొటిమలకి కారణమవుతాయని ఎవరూ చెప్పలేరు. ఉదాహరణకు, ఒక వ్యక్తి లో చాక్లెట్ వలన చర్మం పై పగుళ్ళు రావచ్చు, మరొకరిలో జున్ను వలన మొటిమలు కలగవచ్చు. ఒక్కో ఆహరం ఒక్కో వ్యక్తిలో విభిన్నంగా స్పందిస్తుంది. కాని పైన చెప్పిన ఆహార పదార్థాలు ఎక్కువ మందిలో మొటిమలు కలిగిస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ndroid Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి