Skin Glowing Fruits: ముఖం వెలిగిపోవడానికి, రంగు పెరగడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం. దీనికి ఎన్నో బ్యూటీ ఉత్పత్తులను వాడతాం. అయితే సహజసిద్ధంగా ముఖవర్చస్సు పెంచాలంటే కొన్ని రకాల పండ్లు మీ డైట్ లో చేర్చుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్ట్రాబెర్రీ..
స్ట్రాబెర్రీ డైట్ లో చేర్చుకోవడం వల్ల విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ముఖం కాంతివంతం అవుతుంది. విటమిన్ సి, ఏ. కొల్లాజెన్ ఉత్పత్తికి, స్కిన్ ఎలాస్టిసిటీని పెంచి వృద్ధాప్యఛాయలు రాకుండా కాపాడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది.


ఆరెంజ్..
ఆరెంజ్ లో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి, ఇ ముఖాన్ని కాంతివంతం చేస్తుంది ఆరెంజ్ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల కూడా ఫైన్ లైన్స్, రింకిల్స్ తొలగిపోతాయి.


బొప్పాయి..
బొప్పాయిలో పపెయిన్ అనే ఎంజైమ్‌ ఉంటుంది. ఇది నాచురల్ ఎక్స్‌ఫోలియేటర్‌లాగా పనిచేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తుంది. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. అంతేకాదు బొప్పాయిలో విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉండటం వల్ల స్కిన్ కు పోషణ అందిస్తుంది డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.


అవకాడో..
అవకాడో మీ స్కిన్ రొటీన్ లో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్ ఇ, సీ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ముఖాన్ని మృదువుగా చేస్తుంది. కాంతివంతం చేసి సన్‌ డ్యామేజ్‌ నుంచి రక్షిస్తుంది.  కొల్లాజెన్‌  ఉత్పత్తికి తోడ్పడుతుంది.


ఇదీ చదవండి: ఉదయం పరగడుపున ఇలా తులసి నీరు తాగితే 5 రోగాలు మీ దరి చేరవు


కివి..
కివిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాని సహజసిద్ధంగా మెర్పిస్తుంది. చర్మం పై ఉన్న హైపర్ పిగ్మెంటేషన్ సమస్యను తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి ముఖాన్ని కాంతవంతం చేస్తుంది. అంతేకాదు విటమిన్స్, ఆక్సిడెంట్ సన్‌ డ్యామేజ్ నుంచి నివారించే కాపాడుతుంది.


పైనాపిల్..
పైనాపిల్ కూడా నేచురల్ ఎక్స్‌ఫోలియేటర్‌ లాగా పని చేస్తుంది. ఇందులో బ్రోమిలైన ఎంజైమ్‌ ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. అంతేకాదు పైనాపిల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి .


పుచ్చకాయ..
పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇందులో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి పుచ్చకాయలు లైకో పీన్ ఉంటుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ వృద్ధాప్య ఛాయలు రాకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ, సి చర్మానికి పునరుజ్జీవనం అందిస్తుంది.


ఇదీ చదవండి: ఈ ఒక్క జ్యూస్ తాగి చూడండి.. మీ తెల్ల వెంట్రుకలన్ని నల్లగా మారిపోతాయి..


బెర్రీ పండ్లు..
స్ట్రాబెరీ, బ్లూబెర్రీ ,బ్లాక్ బెర్రీ వంటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది స్కిన్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ ఇ కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడి స్కిన్ ని మెర్పిస్తుంది. అంతేకాదు ఇందులో బెర్రీ పండ్లలో ఫైబర్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది దీంతో డిటాక్సిఫికేషన్ అవుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )