Soaked Almonds VS Raisins: నానబెట్టిన కిస్మిస్ లేదా బాదం రెండిట్లో ఏది బరువు ఈజీగా తగ్గిస్తుంది?
Soaked Almonds VS Raisins For Weight Loss: బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తాం. అయితే స్నాక్ రూపంలో కొన్ని ఆహారాలు డైట్లో తీసుకుంటారు. బరువు తగ్గడానికి ఉదయం తీసుకునే సూపర్ ఫుడ్ ఎంతో ముఖ్యం. ముఖ్యంగా నానబెట్టిన బాదం, కిస్మిస్ వంటివి తీసుకుంటారు. అయితే నానబెట్టిన బాదం లేదా కిస్మిస్ రెండిట్లో ఏ గింజలతో సులభంగా బరువు తగ్గుతారో తెలుసుకుందామా?
Soaked Almonds VS Raisins For Weight Loss: బరువు తగ్గడానికి రకరకాల పండ్లు, గింజలు విత్తనాలు డైట్లో చేర్చుకుంటారు. వీటితో ఆరోగ్యకరంగా బరువు తగ్గుతూనే మంచి ఆరోగ్యాన్ని కూడా పొందుతారు. బరువు తగ్గాలని అన్నం, చపాతీలు వంటివి తినకుండా కొంత మంది ఇలా ఉదయం కేవలం ఆరోగ్యకరమైన గింజలతో బరువు తగ్గడానికి ప్రయత్నిస్తారు. లేకపోతే పండ్లను తింటారు. అయితే, గింజలు తినడం వల్ల మీ ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తుంది. అందుకే గింజలు మీ డైట్‌లో ఉండాల్సిందే. అయితే కొన్ని ఆహారాలు డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు కూడా సులభంగా తగ్గుతారు. మనం ఉదయం నానబెట్టి తీసుకునే బాదం లేదా కిస్మిస్ రెండిట్లో బరువు తగ్గడానికి ఏది ఉపయోగకరంగా తెలుసుకుందాం.
గింజలను నానబెట్టి తీసుకోవడం వల్ల అందులోని టానిన్స్ సులభంగా తొలగిపోతాయి. అందుకే ఒక రోజు ముందుగా నానబెట్టి గింజలను డైట్ లో చేర్చుకోవాలని అంటారు. నానబెట్టిన కిస్మిస్ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీర్ణ ఆరోగ్యానికి కూడా ప్రేరేపిస్తుంది కూడా తక్కువగా ఉంటుంది డయాబెటిస్ వారికి ఇది మంచి స్నాక్.
కిస్మిస్ నానబెట్టి తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి. డయాబెటిస్ వారికి మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో ముఖ్యం. ఇందులో పొటాషియం ఉంటుంది. బ్లడ్ ప్రెజర్ హఠాత్తుగా పెరగనివ్వదు. అంతేకాదు కిస్మిస్ తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు నిర్వహిస్తుంది.
ఇదీ చదవండి: వామ్మో అతిచౌకైన ఏడాది రీఛార్జీ ప్లాన్.. ఇప్పటి వరకు ఏ టెలికాం కంపెనీ ఇవ్వని బంపర్ ఆఫర్..
కిస్మిస్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది ఆహారాన్ని విడగొట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కిస్మిస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది సెల్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.
నానబెట్టిన బాదంతో లాభాలు..
నానబెట్టిన బాదం తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్స్ తగ్గిపోతాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది, బీపీ అదుపులో ఉంటుంది. అంతేకాదు నానబెట్టిన బాదం తరచూ తీసుకోవడం వల్ల ఇందులోని కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఎముక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీంతో మీ ఎముకలు దృఢంగా మారతాయి. బాదం పప్పును ఒక రోజు ముందు నానబెట్టి తొక్క తీసి తినాలి.
ఇదీ చదవండి: జియో కనీవినీ ఎరుగని బంపర్ ప్లాన్.. 11 నెలల వ్యాలిడిటీతో బీఎస్‌ఎన్‌ఎల్‌కు బిగ్ షాకిస్తున్న దిగ్గజ కంపెనీ..
బాదాం, కిస్మిస్ కలిపి తీసుకోవటం వల్ల జీర్ణ ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ప్రతిరోజు మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ప్రాణాంతక వ్యాధులు మీ దరిదాపుల్లోకి రావు. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు నానబెట్టిన బాదం తీసుకోవాలి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి అధికంగా తినకుండా ఉంటారు. దీంతో బరువు సులభంగా తగ్గుతారు. ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువ మోతాదులో ఉంటాయి. బరువు నియంత్రించడానికి ఇది ఆరోగ్యకరమైన స్నాక్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.