Social Distancing: సోషల్ డిస్టెన్సింగ్..బంధాల మధ్య డిస్టెన్సింగ్ కాదు
Social Distancing In Relations: ఈ చిట్కాలను పాటించి మీరు కరోనావైరస్ సంక్షోభంలో సోషల్ డిస్టెన్సింగ్‌ను పాటిస్తూనే బంధాలను బలోపేతం చేసుకోవచ్చు.
Relations In Social Distance Times: కరోనావైరస్ ( Coronavirus ) సంక్షోభం సమయంలో ప్రతీ ఒక్కరు సోషల్ డిస్టెన్సింగ్ ( Social Distance ) మెయింటేన్ చేస్తున్నారు. తమ బంధు మిత్రులను ( Friends and Family ) కూడా కలవలేని పరిస్థితి ఏర్పడింది. అయితే దీని వల్ల బంధాల మధ్య దూరం ( Relationship Distancing ) పెరగకుండా జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంది. మన బంధు మిత్రులను మనం భౌతికంగా కలవలేకపోయినా.. వారితో మన రిలేషన్ ఏ మాత్రం చెడిపోకుండా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. ఈ చిట్కాలను పాటించి మీరు కరోనావైరస్ సంక్షోభంలో సోషల్ డిస్టెన్సింగ్‌ను పాటిస్తూనే బంధాలను బలోపేతం చేసుకోవచ్చు. Also Read : Honeymoon: హనీమూన్‌కి ప్రేయసినీ కూడా తీసుకెళ్లాడు...అడ్డంగా దొరికాడు
ఎక్కువ మందితో ఇలా మాట్లాడండి..
ఈ రోజుల్లో చాలా మంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ( Smart Phones) ఉంటున్నాయి. అందుకే మనకు కావాల్సిన వారితో వీడియో కాలింగ్ ( Video Calling ) లో మాట్లాడటం కూడా సాధారణం అయింది. అయితే వీడియో కాలింగ్‌లో కూడా మనం ఒకేటోచ చేరి గుంపులు గుంపులుగా మాట్లాడలేము. దీని కోసం వాట్సాప్ గ్రూప్ కాల్‌ను ( Whats App ) వినియోగించి ఒకే సారి ఎక్కువ మందితో మాట్లాడ వచ్చు. వాట్సాప్ గ్రూప్ కాల్‌లో మీరు ఎనిమిది మందితో ( WhatsApp Group Call Limit is 8 ) ఒకే సారి మాట్లాడవచ్చు.
మనస్పర్థలు క్లియర్ చేసుకోండి..
ప్రతీ రోజు కొంత సమయాన్ని మీరు మీ బంధు మిత్రులతో ( Kith and Kin ) మాట్లాడటానికి కేటాయించండి. ఏవైనా మనస్పర్థలు ఉంటే క్లియర్ చేసుకోవడానికి ఇదే మంచి తరుణం. ఈ సమయంలో మనిషికి మనిషే ధైర్యం. అందుకే కొన్ని సంవత్సరాలు, నెలల నుంచి ఫోన్ చేయని బంధువులకు కాల్ చేసి సర్ప్రైజ్ ( Surprise Call ) ఇవ్వండి.
ఇమోషనల్‌గా కనెక్ట్ అవండి..
మంచి ఇమోషనల్ కంటెంట్ ఉన్న మెసేజ్ ( Emotional Message )ను టైప్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వారు రిప్లై ఇస్తే అలా అలా చాట్ చేయండి. తరువాత వారితో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండండి. Also Read: Countries Without Covid-19: కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉన్న దేశాలివే
సహాయం చేయండి..
సాంకేతియ యుగంలో అందరికీ ఆన్‌లైన్‌లో రీచార్జులు ( Online Recharge ) , బిల్ పేమెంట్ ( Bill Payment ) చేసే అవగాహన, అవరాశం ఉండకపోవచ్చు. అందుకే మీ రిలేషన్స్ లో ఎవరికి అయినా ఇలాంటి సేవల అవసరం ఉంటే చేసి పెట్టండి.
ఇలాంటి చిన్న చిన్న పనుల వల్ల కరోనావైరస్ సంక్షోభ సమయంలో సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూనే.. బంధాలను మీరు బలోపేతం ( Strong Relationship in Coronavirus Era ) చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని చిట్కాలు మీ వద్ద కూడా ఉంటే కామెంట్ చేయండి. Read : Nagnam Sweety Facts: నగ్నం స్వీటీ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు