Honeymoon: హనీమూన్‌కి ప్రేయసినీ కూడా తీసుకెళ్లాడు...అడ్డంగా దొరికాడు

Extra Marital Affair: వివాహేతర సంబంధం  కాపురాలను కూల్చేస్తున్న వార్తలు రెగ్యులర్‌గా చదువుతుంటాము. కానీ ఇలాంటి స్టోరీ, ఇన్ని ట్విస్టులు అనేవి మాత్రం అందులో ఉండువు. కొత్తగా పెళ్లి చేసుకున్న వ్యక్తి ( Newely Wedded ) భార్యతో హనీమూన్‌కు వెళ్లాడు.

Last Updated : Jul 11, 2020, 05:38 PM IST
Honeymoon: హనీమూన్‌కి ప్రేయసినీ కూడా తీసుకెళ్లాడు...అడ్డంగా దొరికాడు

Honeymoon Wife and Girl Friend: వివాహేతర సంబంధం ( Extra Marital Affair ) కాపురాలను కూల్చేస్తున్న వార్తలు రెగ్యులర్‌గా చదువుతుంటాము. కానీ ఇలాంటి స్టోరీ, ఇన్ని ట్విస్టులు అనేవి మాత్రం అందులో ఉండువు. కొత్తగా పెళ్లి చేసుకున్న వ్యక్తి ( Newely Wedded ) భార్యతో హనీమూన్‌కు వెళ్లాడు. తోడుగా ప్రేయసిని కూడా తీసుకెళ్లాడు. కేరళకు చెందిన ఆ వ్యక్తి తన భార్య, ప్రేయసితో చక్కగా మున్నార్‌ ( Munnar) లో వారం పాటు ఎంజాయ్ చేసి తిరిగి వచ్చాక అడ్డంగా దొరికాడు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌లో ఊచలు లెక్కబెడుతున్నాడు.. Also read:Apsara Rani: అప్సరా రాణీ.. సోషల్ మీడియాను ఏలుతున్న కొత్త బ్యూటీ

ఇంట్లో ఇల్లాలు.. పక్కింట్లో ప్రియురాలు

కేరళకు చెందిన ఒక వ్యక్తి ( పేరు వెల్లడించడం లేదు ) కొత్తగా పెళ్లి చేసుకుని తన భార్యతో మున్నార్‌కు ( Honeymoon in Munnar ) వెళ్లాడు. అయితే అతను వెళ్లడానికి ముందే తన గాళ్ ఫ్రెండ్‌ ( Girl Friend ) కు ఆ హోటల్లో రూమ్ బుక్ చేశాడు. తరువాత ఆ హోటల్ సిబ్బంది సహకరించడంతో అదే హోటల్‌లో భార్యతో పాటు దిగి అక్కడ వారం పాటు ఎంజాయ్ చేశాడు. అలా వారం తరువాత ఇంటికి వచ్చేశాడు. అప్పటి వరకు అతని ప్లాన్‌లో ఎలాంటి లోపం లేదు. 

అయితే తరువాతే అసలు కథ మొదలైంది...
ఇంటికి వచ్చాక అతని భార్య మున్నార్‌లో దిగిన ఫోటోలను ( Tour Photos ) చూడాలని ఫోన్ తెరిచింది. అందమైన లోకేషన్... ప్రేమగా చూసుకునే భర్త దొరికాడు అనే  సంతోషంతో ఫోటోలు చూస్తూ ఉండగా ఆమె మైండ్ బ్లాంక్ చేసేలా ఒక ఫోటో కనిపించింది. వాళ్లు దిగిన హోటల్‌తో పాటు మున్నార్‌లోని పలు లొకేషన్స్‌లో తన భర్తతో పాటు మరో అమ్మాయి కనిపించింది.

ఫొటో డీటెయిల్స్ (Photo Details ) చెక్ చేస్తే తము హనీమూన్ వెళ్లిన తేదీలకే ఆ ఫొటోలు తీసినట్టు అర్థం అయింది. అంతే భర్తను కడిగిపడేసింది. దాంతో కాళ్ల బేరానికి వచ్చాడు భర్త. కానీ భార్య మాత్రం పుట్టింటి వాళ్లకు సమాచారం అందించింది. తరువాత విషయం పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. అలా ఒక ఎఫైర్ అంతం అయింది.

  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

 Read : Nagnam Sweety Facts: నగ్నం స్వీటీ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు 

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x