Sugar Spike 8 Fruits: మనదేశంలో షుగర్ వ్యాధిగ్రస్తులు మిలియన్ల కొద్ది ఉన్నారు. అయితే ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం లైఫ్ స్టైల్ లో కీలక మార్పులు ఉంటే షుగర్ నిమంత్రించవచ్చు. ముఖ్యంగా కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఈరోజు మనం షుగర్ ఉన్న వాళ్ళు తినకూడని పనులు ఏంటో తెలుసుకుందాం. ఎందుకంటే ఇందులో షుగర్ కంటెంట్ అధికంగా ఉంటుంది ఆరోగ్యం పై ప్రభావం చూపుతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పైనాపిల్..
పైనాపిల్ లో విటమిన్ సి ,ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కానీ ఇందులో చక్కెర స్థాయిలు కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఒక కప్పు పైనాపిల్లో 16 గ్రాములు చక్కెర ఉంటుంది. ఇవి రక్తంలో చక్కర స్థాయిలో హఠాత్తుగా పెంచేస్తాయి. ఇది వారికి అనారోగ్యాన్ని తీసుకువస్తుంది. పైనాపిల్ లో ఆ కార్బోహైడ్రేట్స్ కూడా అధిక మోతాదులో ఉంటుంది షుగర్ వ్యాధిగ్రస్తులు తినకూడదు.


పుచ్చకాయ..
పుచ్చకాయలో గ్లైసెమిక్ సూచి 72 ఉంటుంది. కానీ ఇందులో చక్కెర కూడా ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయలో ఉండే ప్రక్టోస్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని పెంచేస్తుంది. డయాబెటిస్ నియంత్రణలో భాగంగా గ్లైసి మిక్స్ సూచి ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. దీనికి బదులుగా అవకాడో తీసుకుంటే ఆరోగ్యకరమైన రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది. మన శరీరానికి కావాల్సిన ఖనిజాలను అందిస్తుంది.


పండిన అరటి పండ్లు..
షుగర్ వ్యాధిగ్రస్తులు పండిన అరటి పండ్లకు కూడా దూరంగా ఉండాలి. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంతేకాదు బాగా పండిన అరటి పండులో 14 గ్రాముల చక్కెర 27 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను బాగా ప్రభావితం చేస్తాయి. అంతేకాదు ఇందులో గ్లైసెమిక్ సూచి కూడా 50 -55 వరకు ఉంటుంది.


మామిడిపండు..
పండ్లలో రారాజు మామిడి పండు. ఇది కూడా షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకోకూడదు. ఇది రుచికరంగా స్వీట్ గా ఉంటుంది. అయితే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఇది హానికరం. ఒక కప్పు మామిడిపండు గుజ్జులో 23 గ్రాముల షుగర్ ఉంటుంది. ఇది గ్లూకోస్ స్థాయిలను పెంచుతుంది. మామిడి పండ్లు గ్లైసెమిక్‌ సూచి 51 ఉంటుంది. ఇది రక్తంలో చక్కర స్థాయిలను పెంచేస్తుంది.


బొప్పాయి..
బొప్పాయిలో చక్కెర తక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్‌  సూచి 60 ఉంటుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెంచేస్తాయి. ఆరోగ్యానికి పనుల అభిప్రాయం ప్రకారం 3 సింగిల్ కప్ తీసుకోవాలి కానీ రక్తంలో చక్కెర స్థాయిలో ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి.


ఇదీ చదవండి: ఈ 5 మసాలాలు నిత్యం మీ డైట్లో ఉండాల్సిందే.. వాటి ఉపయోగాలు తెలిస్తే షాకే..


డ్రైడ్ ఫ్రూట్స్..
అంటే ఫిగ్స్‌, ఖర్జూరం, కిస్మిస్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి . కానీ, వీటిలో చక్కెర కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక 50 గ్రాముల డేట్స్ లో 25 గ్రాములు చక్కెర 43 గ్రాముల కిస్మిస్లు 25 గ్రాముల చక్కెర ఉంటుంది.


చెర్రీస్..
చెర్రీ పండ్లు కూడా రుచికరంగా ఉంటాయి ఇది మంచి హెల్త్ స్నాక్‌లా తీసుకోవచ్చు. కానీ డయాబెటిస్తో బాధపడే వారికి హానికరం ఎందుకంటే ఇందులో చక్కర ఉంటుంది ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే గలవు కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి.


ఇదీ చదవండి:  ఘుమఘుమలాడే పుదీనా చికెన్‌.. అబ్బొ చూస్తేనే నోరూరిపోతుంది..


లీచి పండు..
లీచి పండులో ప్రాక్టోజు, గ్లూకోస్ అధిక మోతాదులో ఉంటాయి. ఒక 100 గ్రాముల లిచీలో 15 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావం చేస్తుంది. GI 79 ఉంటుంది. లీచిలో గ్లైసే మిక్స్ ఇచ్చి 79 ఉంటుంది ఇది షుగర్ లెవెల్స్ హఠాత్తుగా పెరగడానికి కారణమవుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter