Pudina Chicken Recipe: ఘుమఘుమలాడే పుదీనా చికెన్‌.. అబ్బొ చూస్తేనే నోరూరిపోతుంది..

Pudina Chicken Recipe: ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్‌, మటన్, చేపలు వండుకుంటాం. అయితే ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఈసారి కాస్త వినూత్నంగా ప్రయత్నించాలనుకుంటున్నారా? అయితే, ఇది మీకే ఈ రిసిపీ వివరాలు ఇస్తున్నాం.

Written by - Renuka Godugu | Last Updated : Jul 6, 2024, 04:23 PM IST
Pudina Chicken Recipe: ఘుమఘుమలాడే పుదీనా చికెన్‌.. అబ్బొ చూస్తేనే నోరూరిపోతుంది..

Pudina Chicken Recipe: చికెన్‌తో ఎన్నో రిసిపీలు తయారు చేసుకుంటాం. ఈ రిసిపీలు చూడగానే నోరూరిపోతుంది. ఇక తింటే ఇక చివరి ముద్ద వరకు అస్సలు వదలరు. రేపు సండే వచ్చింది. ఇక ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్‌, మటన్, చేపలు వండుకుంటాం. అయితే ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఈసారి కాస్త వినూత్నంగా ప్రయత్నించాలనుకుంటున్నారా? అయితే, ఇది మీకే ఈ రిసిపీ వివరాలు ఇస్తున్నాం. ఘుమఘుమలాడే పుదీనా చికెన్‌ రిసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

పుదీనా చికెన్‌ రిసిపీ తయారీ విధానం.. (4 serves-1/2 kg chicken)
కావాల్సిన పదార్థాలు..
చికెన్‌ -1/2 kg
కొత్తిమీర
పుదీనా
పెరుగు -1/4
పచ్చిమిర్చి
ఉల్లిపాయలు- 2
ఉప్పు- రుచికి సరపడా
అల్లం
వెల్లుల్లి
ఆయిల్‌- 4 tbsp

పుదీనా చికెన్‌ రిసిపీ తయారీ విధానం..

ఇప్పుడు రుచికరమైన చికెన్‌ తయారు చేసుకోవడానికి ముందుగా పుదీనా, కొత్తిమీరా తీసుకుని వాటి ఆకులను మాత్రమే తుంచి పెట్టుకోండి. ఆ తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలను కట్‌ చేసి కొన్ని పచ్చిమిరపకాయలను చీల్చి పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లిని కూడా తొక్క తీసి పెట్టుకోండి.. 

పుదీనా ఒక వంతు తీసుకుంటే రెండు వంతుల కొత్తిమీర, తగినన్ని పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం, ఓ 20 వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక మిక్సీ జార్‌లోకి తీసుకుని మెత్తని పేస్ట్‌ చేసుకోవాలి. ఇందులో కావాలంటే కొద్దిగా నీరు కూడా పోసుకోవాలి.

ఇదీ చదవండి: ఈ 5 మసాలాలు నిత్యం మీ డైట్లో ఉండాల్సిందే.. వాటి ఉపయోగాలు తెలిస్తే షాకే..

ఇప్పడు ఈ పేస్ట్‌ను పెద్ద గిన్నెలోకి తీసుకుని అందులోనే పెరుగు, చికెన్‌ ముక్కలు ఉప్పు వేసి బాగా కలపాలి. మ్యారినేషన్‌ కోసం ఓ గంటపాటు అలాగే ఉండనివ్వండి.

ఆ తర్వాత ఓ కడాయి తీసుకుని వేడి చేసుకోవాలి. ఇందులో ఓ నాలుగు చెంచాల నూనె కూడా వేసి మీడియం మంట పై వేడి చేసుకోవాలి. కట్ చేసిన ఆనియ్స్‌ వేసి గోల్డెన్ బ్రౌన్‌ కలర్‌ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మ్యారినేట్‌ చేసుకున్న చికెన్‌ ముక్కలు కూడా వేసుకోవాలి. మీడియం మంటపై ఓ 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 

ఇదీ చదవండి: మంగళూరు స్టైల్‌ చికెన్‌ ఘీ రోస్ట్‌ రిసిపీ.. చూస్తేనే నోరూరిపోతుంది..

చివరగా పుదీనా ఆకులను వేసి గార్నిష్‌ చేసుకోవాలి. వేడివేడిగా చపాతీల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News