Summer Health Tips: ఏప్రిల్ నెలకు ముందే ఎండలు మండిపోతున్నాయి. కనుక మీరు ఆరోగ్యం పట్ల కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తినే ఆహారంతో పాటు తాగే శీతల పానియాలు, జూస్, శారీరక శ్రమ విషయంలో శ్రద్ధ వహించాలి. వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ డీహైడ్రేషన్‌కు గురికాకుండా శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అధికంగా నీరు తీసుకోవాలి. ఎక్కువ సమయం శారీరక శ్రమ చేయకూడదు. అలా చేస్తే వీక్‌నెస్‌కు దారితీస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నరాల సమస్య సైతం వస్తుంది. రక్తపోటు పెరిగి, తద్వారా గుండెపై ఒత్తిడి అధికం అవుతుంది. కనుక పౌష్టికాహారం తీసుకోవాలి. వేసవి కాలంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎక్సర్‌సైజ్, జిమ్ లాంటి శారీరక శ్రమ చేయడం ఆరోగ్యానికి మంచిదికాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం వేళ వర్కౌట్లు చేసుకుంటే శరీరం అధికంగా డీహైడ్రేట్ బారిన పడకుండా(Summer Tips) ఉండనుంది. ఆ సమయంలో కాలుష్యం సైతం చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. 


Also Read: Muskmelon Benefits: వేసవిలో కర్భూజ తింటే వడదెబ్బకు చెక్, గుండెకు సైతం ప్రయోజనం


వేసవిలో మీరు వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. ముదురు రంగు దుస్తులకు బదులుగా లేత రంగు దస్తులు ధరించాలి. తద్వారా శరీరానికి తగినంత గాలి తగిలేలా చేస్తాయి. చెమట సమస్యకు చెక్ పెడతాయి. చెమటను సైతం ఆ దుస్తులు త్వరగా పీల్చుకుంటాయి.


వేసివిలో బయటకు వెళుతున్నారంటే మంటల్లో నడుస్తున్నట్లు అనిపిస్తుంది. కనుక ముఖ్యంగా మహిళలు సన్‌స్క్రీన్ లోషన్లు శరీరానికి రాసుకుని బయటకువెళ్లడం ద్వారా వడదెబ్బ బారిన పడకుండా కాస్త ఉపశమనం లభిస్తుంది. వీలైతే టోపీ లాంటివి ధరించాలి, లేకపోతే గొడుగు తీసుకుని మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లాల్సి.


Also Read: Cucumber Benefits: సమ్మర్‌లో కీరదోస తింటే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం


ఇంటి నుంచి మధ్యాహ్నం వేళ కాలు బయట పెడుతున్నారంటే మీ వెంట కచ్చితంగా మంచి నీళ్ల బాటిల్(Drinking Water) తీసుకెళ్లాలి. పరిశుభ్రమైన మంచి నీటిని క్రమం తప్పకుండా కొంత మోతాదులో తాగుతూ ఉండాలి. శరీరంలో వేడి నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తుంది. వీలైతే పండ్ల రసాలు, కొన్ని రకాల తాజా కూరగాయాలు తినడం మంచిది.


ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడండి..
శరీరం పదే పదే అలసిపోయినట్లు అనిపించినా, స్వల్పంగా తలనొప్పి వచ్చినా, శరీరం నొప్పి అనిపిస్తున్నా, కళ్లు తిరగడం, వాంతికి అవుతుందేమో అనిపిస్తున్నా, గుండె వేగం పెరిగినా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి సమయాలలో కొన్ని నీరు తాగాలి. జనం గుంపుగా లేని ప్రదేశంలో కూర్చోవాలి. వీతైలే ఏదైనా పండు తినడం గానీ, పండ్ల రసాలు తాగితే కాస్త ఉపశమనం ఉంటుంది. డాక్టర్‌ను సైతం సంప్రదించి సమస్యకు చికిత్స తీసుకోవాలని మరవకూడదు.


Also Read: Benefits Of Neem Leaves: రుచిలో చేదు, ఆరోగ్య ప్రయోజనాలలో రారాజు వేప, జూస్ తాగితే మరెన్నో లాభాలు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook