Summer Skin Care Tips: ఈ సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్ తప్పక అనుసరించండి.. లేదంటే మీ స్కిన్ డ్యామేజ్ అవ్వచ్చు..
Summer Skin Care Tips: మండుతున్న ఎండలు దీనికి సరైన ఆరోగ్య జాగ్రత్తుల తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. ముఖ్యంగా కాటన్ దుస్తులు ధరించడం, నీళ్లు ఎక్కువగా తాగడం, ఎండ సమయంలో బయటకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తారు.
Summer Skin Care Tips: మండుతున్న ఎండలు దీనికి సరైన ఆరోగ్య జాగ్రత్తుల తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. ముఖ్యంగా కాటన్ దుస్తులు ధరించడం, నీళ్లు ఎక్కువగా తాగడం, ఎండ సమయంలో బయటకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తారు. అయితే, ఆరోగ్యపరంగా మాత్రమే కాదు సరైన స్కిన్ కేర్ టిప్స్ కూడా పాటించాలని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే మీ స్కిన్ పర్మనెంట్ గా డ్యామేజ్ అయ్యే పరిస్థితులు ఏర్పడతాయి.
విపరీతమై ఎండ భానుడి భగభగలతో సూర్యుడి హానికర కిరణాలు మన చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి. దీంతో ముఖంపై యాక్నే, నల్లమచ్చలు ఏర్పడతాయి. ఈ యూవీ కిరణాల వల్ల ముఖంపై త్వరగా వృద్ధాప్యఛాయలు కనిపిస్తాయి.
సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్..
సన్ స్క్రీన్..
ముఖ్యంగా ఎండ సమయంలో మీరు బయటకు వెళ్లినప్పుడు నాణ్యమైన సన్ స్క్రీన్ ఉపయోగించాలని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ముఖం ట్యాన్ అవ్వకుండా ఉంటుంది. సన్‌స్క్రీన్ ఎండ నుంచి మన ముఖాన్ని ఓ షీల్డ్ లా కాపాడుతుంది. సూర్యుని హానికర కిరణాలతో మన ముఖం పాడవ్వకుండా ఉండి ముఖం డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది.
SPF..
మాములు సన్ స్క్రీన్ కాకుండా SPF30 అంతకు ఎక్కువగా ఉన్న సన్ స్క్రీన్ ఉపయోగించాలి. బయట ఎండల్లో తిరగాల్సి వస్తున్నప్పుడు ప్రతి 2 గంటలకు ఒకసారి సన్ స్క్రీన్ ఉపయోగించాలి. ఒక వేళ మీకు విపరీతంగా చెమటలు పట్టినా, స్విమ్మింగ్ వెళ్లినా సన్‌స్క్రీన్ ఉపయోగించండి.
మాయిశ్చరైజర్..
ఎండకాలం మాయిశ్చరైజ్ బేస్ ఉండే క్రీములను మాత్రమే వినియోగించాలి. అంటే లైట్ వెయిట్ ఉండే స్కిన్ క్రీములు మాత్రమే ఉపయోగించండి. గ్రీజీ, స్టిక్కీగా ఉండే క్రీములు వాడకూడదు. మాయిశ్చరైజర్ ఉన్న క్రీములు మీ చర్మాన్ని కాపాడతాయి. టీ ట్రీ ఆయిల్, లెమన్ బేస్ ఉండే క్రీములు ఆయిల్ స్కిన్ ఉన్నవారికి మరింత మేలు చేస్తాయి.
స్కిన్ ఎక్స్‌ఫోలియేట్..
విపరీతమైన వేడి వల్ల ప్రతి వారంలో రెండుసార్లు స్కిన్ ఎక్స్‌ఫోలియేట్ చేసుకోవాలి. స్కిన్ ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల ముఖంపై ఉన్న డెడ్ స్కిన్ తొలగిపోతుంది. ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
నో మేకప్..
ఎండ సమయంలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లేవారు ఎక్కువ మేకప్ వేసుకోకండి. లేకపోతే ముఖం ఆయిలీగా మారిపోతుంది. వీలైనంత వరకు మేకప్ లేకుండానే బయటకు వెళ్లండి. లేదా లైట్ మేకప్ వేసుకోండి. కొన్ని బ్యూటీ ఉత్పత్తుల వల్ల ఈ సమయంలో ముఖంపై మచ్చలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: మండే ఎండలకు చల్లదనాన్నిచ్చే 5 కూలింగ్ ఫేస్ మాస్క్స్.. ముఖానికి రెట్టింపు మెరుపు..
సీరమ్..
బయటకు వెళ్లినప్పుడు ఫేస్ సీరమ్ తప్పకుండా వాడండి. ముఖ్యంగా విటమిన్ సీ సీరమ్ ముఖంపై వాడాలి. మాయిశ్చరైజ్ చేసిన తర్వాత విటమిన్ సీ సీరమ్, సన్ స్క్రీన్ వేసుకోవాలి. ఇది ముఖంపై ఉన్న పిగ్మంటేషన్ను నివారిస్తుంది.
కళ్లు, పెదాలు..
ఎండ సమయంలో బయటకు వెళ్లినప్పుడు SPf లిప్ బామ్‌తోపాటు కంటి యూవీ ప్రొటెక్షన్ ఇచ్చే కళ్లజోడును ధరించండి.
ఇదీ చదవండి: పుచ్చగింజల ఆయిల్‌తో ఈ మాస్క్ వేయండి.. మీ కురులు మెరిసిపోతాయి..
హైడ్రేటెడ్..
ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న ఎండకాలం మన శరీరం నుంచి నీరు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది.కాబట్టి ఎప్పటికప్పుడు నీరు తాగుతూ హైడ్రేటెడ్ గా ఉండండి. పండ్లు, కూరగాయలను మీ డైట్లో చేర్చుకోండి. ఫ్రై ఫుడ్స్, మసాలా ఆహారాలకు నో చెప్పండి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter