Tamarind Mask For Face: వంట గద్దిలో ఉపయోగించే పదార్థాలు మన ఆహారాన్ని రుచికరంగా మారచడమే కాకుండా చర్మనికి  కూడా ఎంతో సహాయపడుతాయి. అందులోను పుల్లప్లుల్లటి చింతపండు గురించి ప్రత్యేకంగా  చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతుంటారు. అయితే కేవలం వంటల్లోకి మాత్రమే కాకుండా చర్మ సౌందర్యం పెంచడంలో కూడా మేలు చేస్తుందని  చెబుతున్నారు. దీని ఉపయోగించడం వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు, దురద, ఎర్ర మచ్చలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చింతపండులో సహాజమైన గుణాలు చర్మం కాంతిని పెంచుతాయి. బయట మార్కెట్‌లో లభించే క్రీములు, ప్రొడెక్ట్స్‌ కంటే ఇంటి చిట్కాలు ఉపయోగించడం వల్ల  మంచిఫలితాలు పొందవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే చింతపండును ఉపయోగించి ఫేస్‌ ప్యాక్స్‌ ఎలా తయారు చేసుకోవచ్చు?  ఇవి ఎలా సహాయపడుతాయి? అనే విషయాలు తెలుసుకుందాం.


ముల్తానీ మట్టి- చింతపండు: 


చర్మం కాంతివంతంగా కనిపించడానికి చాలా మంది ముల్తానీ మట్టిని ఉపయోగిస్తారు. అయితే చింతపండుతో దీని ఉపయోగిస్తే అద్భుమైన ఫలితాలు పొందవచ్చని చర్మనిపుణులు చెబుతున్నారు. దీని కోసం నిమ్మకాయంత సైజ్‌ చింతపండును తీసుకోవాలి. దీని నీటిలో వేసి గుజ్జు తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు నీటిలోకి 1 స్పూన్‌  ముల్తానీ మట్టితో పాటు రోజ్‌ వాటర్‌ కలుపుకోవాలి. ఈ ప్యాక్‌ రెడీ అయిన తరువాత మెడకు, మొటిమలు ఉన్న చోట, మాస్క్‌లా ఆప్లై చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు ఆప్లై చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. 


చింతపండు గుజ్జు-పసుపు: 


 చాలా మంది కొన్ని ప్రత్యేక సంద్భరాల్లో అందంగా కనిపించాలని మార్కెట్‌లో లభించే ఫేస్‌ గ్లో క్రీములను ఉపయోగిస్తారు. కానీ వీటిని వల్ల చర్మం పైన మొటిమలు ఏర్పుడుతాయి. అయితే దీనికి బదులుగా ఒక టేబుల్‌ స్పూన్‌ చింతపండు రసంలోకి అరచెంచా పసుపును కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్‌ పై రాసుకోవాలి. దీని 20 నిమిషాల పాటు ఉంచి శుభ్రంగా నీటితో కడుకోవాలి. ఇలా చేయడం వల్ల సహాజమైన కాంతి మీ సొంతం  అవుతుంది.  


చింతపండు- బేకింగ్ సోడా


మేకప్‌ తీసిన తరువాత ఖచ్చితంగా ఫేస్‌ స్క్రబ్‌ చేసుకోవాలి. అయితే దీని కోసం చాలా మంది ఎక్కువ ఖరీదైనా స్క్రబ్‌లను ఉపయోగిస్తారు. కానీ చింతపండు గుజ్జులోకి టేబుల్‌ స్పూన్‌ నిమ్మకాయ రసం బేకింగ్‌ సోడా, పంచదార కలుపుకోవాలి. దీని చర్మంపై మృదువుగా మాసాజ్ చేసి 10 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తరువాత గోరువెచ్చని నీతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపైన ఉండే జిడ్డు, మొటిమలు, ఎర్ర మచ్చలు, మురికి తగ్గుతాయి. 


గమనిక: మీరు ఈ చింతపండు ఫేస్‌ ప్యాక్‌ను ఉపయోగించే ముందు చర్మనిపుణులు సలహా తీసుకోవడం చాలా మంచిది.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి