Tea Powder Quality Check: టీ అందరికీ ఇష్టమైన పానీయం. కానీ మార్కెట్‌లో అంతా నకిలీమయమైపోయింది. ఏది అసలైందో ఏది నకిలీదో తెలియని పరిస్థితి. అందుకే ఏది అసలైన తేయాకు, ఏది కాదనేది కొన్ని సులభమైన చిట్కాలతో తెలుసుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతీయుల్లో అత్యధికులు ఇష్టంగా తాగేది టీ మాత్రమే. తేయాకు నాణ్యతను బట్టి టీ రుచి మారుతుంది. అందుకే ఇష్టంగా తాగే టీ విషయంలో తేయాకు ఎప్పుడూ మంచిదై ఉండాలి. కానీ మార్కెట్‌లో చాలావరకూ నకిలీ లభ్యమౌతోంది. నకిలీ తేయాకు వినియోగం వల్ల రుచి మారిపోతుంది సరికదా..లేనిపోని ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అందుకే మార్కెట్‌లో లభించే తేయాకు పొడుల్లో ఏది అసలైంది ఏది కాదనేది తెలుసుకోగలగాలి. తేయాకు ఒరిజినల్ లేదా డూప్లికేట్ అనేది ఎలా తెలుసుకోవాలో చూద్దాం..


తేయాకు అసలైందా కాదా ఎలా తెలుసుకోవడం


1. చల్లటి నీళ్లతో తేయాకు అసలైందా కాదా అనేది తెలుసుకోవచ్చు. ముందుగా ఓ గ్లాసు చల్లటి నీళ్లలో రెండు స్పూన్ల తేయాకు పొడి కలపండి. 1 నిమిషం తరువాత నీళ్లలో రంగు తేలితే..ఆ టీ పొడి నకిలీ అని అర్దం లేదా నెమ్మది నెమ్మదిగా రంగు పోతుంటే మాత్రం టీ పొడి అసలైందని అర్ధం.


2. మీరు వినియోగించే టీ పొడి అసలైందో కాదో తెలుసుకునేందుకు ముందుగా ఒక స్టీల్ గిన్నెలో కొద్దిగా నిమ్మరసం వేయాలి. టీ పొడిని కొద్దిగా ఆ నిమ్మరసంలో వేయాలి. ఇప్పుడు ఏ రంగు వదులుతుందనేది పరిశీలనగా చూడాలి. ఒకవేళ నారింజ లేదా ఇతర రంగు వదులుతుంటే..అది నకిలీ అని అర్ధం. ఒకవేళ పచ్చ లేదా పసుపు కలిసిన నారింజ రంగు వదులుతుంటే ఒరిజినల్ అని అర్ధం.


3. టిష్యూ పేపర్ ద్వారా కూడా టీ పొడి ఒరిజినల్ లేదా డూప్లికేట్ అనేది తెలుసుకోవచ్చు. ముందుగా ఒక టీష్యూ పేపర్‌లో రెండు స్పూన్ల టీ పొడి వేసి అందులో కొన్ని చుక్కలు నీళ్లు వేసి ఎండలో పెట్టాలి. కాస్సేపటి తరువాత టిష్యూ పేపర్‌పై నుంచి టీ పొడి వేరు చేసి చూడాలి. టిష్యూ పేపర్‌పై మరక ఉందా లేదా అనేది పరిశీలించాలి. మరక ఉంటే ఆ టీ పొడి నకిలీ అని గుర్తించవచ్చు. మరక లేకపోతే అసలైందని అర్ధం.


Also read: Butter Milk Benefits: మజ్జిగతో స్థూలకాయం ఎలా తగ్గుతుంది, సులభమైన చిట్కాలతో మజ్జిగ ఉపయోగాలు



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.