Curd Curry Recipe For Rice: ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయాయా? ఈ మసాలా పెరుగు కర్రీని ట్రై చేయండి!
Curd Curry Recipe For Rice In Telugu: పెరుగు తినని వారు మసాలా పెరుగు కర్రీ రెసిపీని క్రమం తప్పకుండా ట్రై చేస్తే తప్పకుండా పెరుగుకి ఒక ఫ్యాన్ అయిపోతారు. అయితే ఈ మసాలా పెరుగు కర్రీని తయారు చేసుకోవడం చాలా సులభం. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Curd Curry Recipe For Rice In Telugu: పెరుగు అంటే ఇష్టపడని వారు చాలామంది ఉంటారు. అయితే ఇలాంటి వారి కోసం పెరుగుతో ఓ రెసిపీని తీసుకువచ్చాం. ఈ రెసిపీ తో పెరుగు తినడమే కాకుండా కంచంలో పోసుకొని పెరుగు తినని వారు కూడా తాగడం ఖాయం. చాలామందికి పెరుగన్నం, పోపు పెట్టిన పెరుగు తెలిసి ఉంటుంది. కానీ పెరుగును కూరలా కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా కూరల తయారుచేసుకొని తీసుకోవడం వల్ల ఎంతో రుచిగా.. శరీరానికి ఆరోగ్యంగానూ ఉంటుంది. ఈ పెరుగు కర్రీని ఎవరైనా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ ని ఎలా తయారు చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు..
ఒక కప్పు గేదె పాలతో తయారు చేసిన పెరుగు
మూడు టేబుల్ స్పూన్ల నూనె
రెండు బిర్యాని ఆకులు
నాలుగు లవంగాలు
ఒక టీ స్పూన్ జీలకర్ర
మూడు యాలకులు
అర టీ స్పూన్ పసుపు
ఒక టీ స్పూన్ ధనియాల పొడి
మూడు రెమ్మల కరివేపాకు
రెండు టీ స్పూన్ల శనగపిండి
తరిగిన కొత్తిమీర ఆకు
అర టీ స్పూన్ గరం మసాలా
కావలసినంత నీరు
తగినంత ఉప్పు
తయారీ విధానం:
ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పెట్టుకొని దానిపై కళాయి పెట్టుకోవాల్సి ఉంటుంది. అందులోనే కావలసినంత నూనెను వేసుకొని బాగా వేడి చేయాల్సి ఉంటుంది.. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించాల్సి ఉంటుంది. అలాగే అందులోనే మసాలా దినుసులు జీలకర్ర వేసి ఐదు నిమిషాల పాటు వేయించాల్సి ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి.
ఇలా వేయించుకున్న తర్వాత తగినంత కారం కరివేపాకు శెనగపిండి గరం మసాలా ధనియాల పొడి వేసుకొని మరో 3 నిమిషాల పాటు బాగా వేయించాల్సి ఉంటుంది. ఇలా వేయించిన తర్వాత పెరుగును కూడా పోసుకొని రెండు నిమిషాల పాటు కొద్దిగా మార్గనివ్వాలి ఆ తర్వాత నీటిని పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి నూనె పైకి వచ్చేంతవరకు వేయించుకొని పైనుంచి సన్నగా తరుముకున్న కొత్తిమీర వేసుకొని మరో ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఆహా అనాల్సిందే..
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter