Thati Bellam Tea Recipe: అతిగా చక్కెర తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మందిలో దీని కారణంగా దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. చాలా మందిలో టీలలో ఎక్కుంగా చక్కెరను వినియోగిస్తున్నారు. ఇలా ప్రతి రోజు తాగడం వల్ల భవిష్యత్‌లో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ చక్కెరకు బదులుగా తాటి బెల్లాన్ని ప్రతి రోజు వినియోగించడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. దీనిని ఎక్కువగా భారత్‌తో పాటు శ్రీలంక, ఆగ్నేయాసియాలో ఎక్కువగా వాడుతున్నారు. తాటి బెల్లంలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్‌తో పాటు విటమిన్ B వంటి పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల తగ్గించేందుకు ఎంతగానో సహాయపడతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు శ్వాసకోశ సమస్యలను తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే తాటి బెల్లం తయారు చేసిన టీని ప్రతి రోజు తాగడం వల్ల వీటి కంటే రెట్టింపు లాభాలు కలుగుతాయి. అయితే మీరు కూడా ఇంట్లోనే సులభంగా తాటి బెల్లాన్ని తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా సులభంగా తయారు చేసుకోండి. 


తాటి బెల్లం టీకి కావాల్సిన పదార్థాలు:
1 కప్పు నీరు
1/2 - 1 టీస్పూన్ తాటి బెల్లం 
1/2 టీస్పూన్ అల్లం తురుము
1/4 టీస్పూన్ ఏలకుల పొడి 
1/4 టీస్పూన్ జీలకర్ర పొడి
పాలు 


తయారీ విధానం:
ముందుగా ఈ తాటి బెల్లం టీని తయారు చేసుకోవడానికి ఒక చిన్న గిన్నెలో నీటిని మరిగించాల్సి ఉంటుంది.
నీరు మరిగిన తర్వాత, అల్లం తురుము, తాటి బెల్లం వేసి బాగా కలపండి.
ఇలా కలిపిన నీటిని దాదాపు 5 నిమిషాలు లేదా బెల్లం కరిగే వరకు మరిగించాలి.
ఆ తర్వాత ఇందులోనే ఏలకుల పొడి, కావాలనుకుంటే జీలకర్ర పొడి వేసి మరో 1 నిమిషం పాటు మరిగించాలి.
మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, టీని ఒక కప్పులోకి వడకట్టి, పాలు వేసి బాగా కలపి మరో 12 నిమిషాల మరిగించి తీసుకోండి..


చిట్కాలు:
టీ మరింత రుచిగా ఉండడానికి ఇందులో నిమ్మరం కూడా వినియోగించవచ్చు.
అలాగే ఈ టీలో పోషకాలు రెట్టింపు అవ్వడానికి తులసి ఆకులతో పాటు పసుపును కూడా వినియోగించవచ్చు.
కోల్డ్‌ టీలు తాగాలనుకునేవారు ఈ టీని  రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచుకుని కూడా తీసుకోవచ్చు. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


తాటి బెల్ల టీ ప్రయోజనాలు:
జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి శ్వాసకోశ సమస్యలకు తాటి బెల్లం టీ ప్రభావంతంగా సహాయపడుతంది.
తాటి బెల్లం టీ ప్రతి రోజు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా మలబద్ధకం నుంచి కూడా విముక్తి కలుగుతుంది. 
రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
శరీరాన్ని వేడిని తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి