Rapid Hair Growth:  మీకు జుట్టు పెంచుకోవడం ఇష్టమైతే దీనికి సరైన హెయిర్ కేర్ జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి లైఫ్‌స్టైల్ ఉండాలి. ఎటువంటి కేమికల్స్ లేకుండా ఇంట్లో ఉండే కొన్ని మూలికలతో జుట్టు విపరీతంగా పెరుగుతుంది. ఈ మూలికలు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంతోపాటు స్కాల్ప్ ఆరోగ్యానికి మెరుగుపరిచి, హెయిర్ ఫాలికల్స్ బలపరుస్తుంది. అవేంటో తెలుసుకుందాం. ఈ మూలికలను మాస్క్ లేదా హెయిర్ ఆయిల్ రూపంలో ఉపయోగించాలి. ఇది జుట్టు ఆరోగ్యానికి ప్రోత్సహించి త్వరగా జుట్టు పెరిగేలా ప్రోత్సహిస్తుంది. అంతేకాదు దీంతోపాటు సమతుల్య ఆహారం కూడా తీసుకోవాలి. మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భృంగరాజ్..
ఇది మూలికలకే కింగ్. భృంగరాజ్ పొడి, ఆయిల్ జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది.  జుట్టు ఊడటాన్ని ఆపుతుంది. తలకు మంచి పోషణనిచ్చి, బ్లడ్ సర్క్యూలేషన్ పెంచుతుంది. హెయిర్ ఫాలికల్స్‌ను బలపరిచి జుట్టు ఆరోగ్యంగా.. త్వరగా పెంచుతుంది.


ఉసిరి..
ఉసిరిలో జుట్టును పోషించే శక్తి ఉంటుంది. అంతేకాదు ఇందులో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జుట్టు పెరుగుదలను పెంచి, తల వెంట్రుకలు తెలబడకుండా చేస్తుంఇ. ఉసిరి ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాలుగా దొరుకుతుంది. ఉసిరి నూనె, ఉసిరి పౌడర్, టీ వంటివి అందుబాటులో ఉన్నాయి.


మెంతులు..
ఇందులో ప్రోటీన్, నికొటిన్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టుపెరుగుదలకు ఎంతో లాభదాయకం. మెంతులు స్ల్పిట్ ఎండ్ సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. మెంతులు జుట్టుకు పేస్ట్‌, నూనె రూపంలో కూడా అప్లై చేసుకోవచ్చు. రాత్రంతా నీళ్లలో నానబెట్టిన మెంతి గింజలను పేస్ట్‌ చేయాలి. ఉదయం జుట్టుకు అప్లై చేసి సాధారణ నీటితో జుట్టు కడిగేసుకుంటే సరిపోతుంది.


ఇదీ చదవండి: ఈ మిరాకిల్ జ్యూస్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. మీరు తప్పకుండా తీసుకోండి!


మందార..
మందార పూవు, ఆకుల్లో విటమిన్స్, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణనిస్తాయి. జుట్టు పెరుదలకు ప్రేరేపించి జుట్టు ఊడకుండా ఆపుతుంది. ఇందులో సహజసిద్ధ కండీషనింగ్ లక్షణాలు ఉన్నాయి. జుట్టును మృదువైన పెరుగుదలను నిర్వహిస్తుంది.  మందారపూలు, ఆకులతో మాస్క్ తయారు చేసుకోవచ్చు. దీంతో నూనె కూడా తయారుచేసుకోవచ్చు. దీంతో జుట్టు స్పీడ్‌గా పెరుగుతుంది.


కలబంద..
జుట్టుకు కలబంద మాయిశ్చర్ ఇస్తుంది. కలబందను నేరుగా మీ జుట్టుకు అప్లై చేసుకుంటే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.  ఇది పీహెచ్ లెవల్‌ను బ్యాలన్స్ చేస్తుంది. కలబంద స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ సమస్యను తగ్గిస్తుంఇ. కలబంద హెయిర్ ఫోలికల్స్ కు పోషణ ఇస్తుంది. ముఖ్యంగా కలబంద మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది.


ఇదీ చదవండి: ద్రాక్ష పండు రుచికరం మాత్రమే కాదు ఆరోగ్యకరమైనది కూడా..!


వేపాకు..
వేపలో యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇది జుట్టు ఆరోగ్యానికి మంచిది. స్కాల్ప్ ను క్లెన్స్ చేసి యాంటీ డాండ్రఫ్ గా పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా జుట్టును కాపాడుతుంది.  వేపనూనె, వేప ఉండే వస్తువులతో జుట్టు ఆరోగ్యంగా, త్వరగా పెరుగుతుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter