Thyroid Removal Food: మెడ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి శరీరంలో ఒక భాగమే. ఇది బటర్ఫ్లై ఆకారంలో ఉంటుంది. ఇది మెటబాలిజాన్ని మెరుగుపరిచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది అలాగే శరీరంలో ఉండే ప్రధాన అవయవాలను నడిపించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా అవయవాల పనితీరును మెరుగుపరిచేందుకు కూడా సహాయపడుతుంది. అందుకే థైరాయిడ్ గ్రంథికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

థైరాయిడ్ గ్రంధి సమస్యల బారిన పడితే ఓవరాల్‌గా హెల్త్ పై తీవ్ర ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ చేసే ఈ గ్రంధి సరిగా పనిచేయకపోతే హైపోథైరాయిడిజం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలామంది కోవిడ్ కారణంగా థైరాయిడ్ భారిన పడుతున్నారు. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి వివిధ రకాల రసాయనాలతో కూడిన మందులు వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోతుందని కొంతమంది వాపోతున్నారు. నిజానికి థైరాయిడ్ నుంచి కొన్ని ఆయుర్వేద చిట్కాల ద్వారా కూడా ఉపశమనం పొందవచ్చు. 


మనం రోజు వంటల్లో వినియోగించే కొత్తిమీర కూడా థైరాయిడ్‌కు ఔషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీరలో ఉండే ఐరన్‌తో మెగ్నీషియం, పొటాషియం థైరాయిడ్ కు చెక్ పెట్టేందుకు ఎంతగానో సహాయపడతాయట. అలాగే ఇందులో ఉండే కొన్ని ఖనిజాలు శరీరానికి వివిధ రకాల ప్రయోజనాలను కూడా చేకూర్చుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


రెగ్యులర్గా కొత్తిమీరను థైరాయిడ్ ఉన్నవాళ్లు జ్యూస్ లా తయారు చేసుకొని తాగడం వల్ల దాని లెవెల్స్ నార్మల్ అవుతాయి. అలాగే శాశ్వతంగా థైరాయిడ్ నుంచి విముక్తి లభించే అవకాశాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే కొన్ని గుణాలు శరీరాన్ని హైడ్రేట్ గా చేసేందుకు కూడా సహాయపడతాయి. థైరాయిడ్ ఉన్నవారు కొత్తిమీర రసాన్ని ఉదయం పరిగడుపున తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలాగే కొత్తిమీర రసం తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా ఈ థైరాయిడ్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చని వారంటున్నారు.


Also Read: Ram Gopal Verma: నా అరెస్ట్‌పై మీకు ఎందుకు తొందర.. కేసులపై న్యాయ పోరాటం చేస్తా'



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.