COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Tips For Diabetes Control: మధుమేహం ప్రపంచవ్యాప్తంగా ప్రధాన వ్యాధిగా మారింది. ప్రస్తుతం చిన్న పెద్ద లేకుండా చాలామంది ఈ సమస్య బారిన పడుతున్నారు. మధుమేహంతో బాధపడుతున్న వారు రోజువారి జీవనశైలిలో తప్పకుండా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల కూడా రక్తంలోని షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చు. 


✺ మధుమేహంతో బాధపడుతున్న చాలామందిలో షుగర్ లెవెల్స్ పెరగడం కారణంగా మూత్రపిండాలు దెబ్బతిని.. గుండెపోటుతో పాటు అధిక రక్తపోటు సమస్యలు వస్తున్నాయి. డయాబెటిస్ ఉన్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.


✺ మధుమేహం ఉన్నవారు ప్రతిరోజు డైట్ లో ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రతిరోజు ఆకుకూరలతో పాటు పండ్లను తీసుకోవడం వల్ల బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. 


✺ డయాబెటిస్ ఉన్నవారు రాత్రి భోజనం చేసిన తర్వాత వెంటనే నిద్రపోకుండా ఉండాలి. అంతేకాకుండా డిన్నర్ తర్వాత 30 నుంచి 35 నిమిషాల పాటు నడవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరం అవుతాయి.


Also read: OLD Parliament History: కొత్త పార్లమెంట్ సరే..పాత పార్లమెంట్ చరిత్ర, ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలుసా


✺ మధుమేహంతో పోతున్నవారు ప్రతిరోజు ఉదయం పూట ఒక గంట పాటు వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. వ్యాయామాలు చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా శరీరం కూడా దృఢంగా మారుతుంది. దీంతో దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయి.


✺ డయాబెటిస్తో బాధపడేవారు ప్రతిరోను రాత్రి భోజనాన్ని పడుకునే కంటే రెండు గంటల ముందే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Also read: OLD Parliament History: కొత్త పార్లమెంట్ సరే..పాత పార్లమెంట్ చరిత్ర, ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలుసా



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook