Teeth Whitening Tips: దంతాలు ఆరోగ్యంగా ఉండటానికి అందరూ ప్రయత్నిస్తారు. ఇవి అందంగా ఉంటేనే ఆత్మవిశ్వాసంతో నవ్వగలరు, మాట్లాడగలరు. అంతేకాదు దంత ఆరోగ్యం మన ఆయుష్షుపై కూడా ప్రభావం చూపుతుందని చెబుతారు. అందుకే రోజుకు రెండుమార్లు శుభ్రం పళ్లు తోముకోవాలని సలహా ఇస్తారు. అయితే, కొంతమందికి ఎంత శుభ్రం చేసినా పళ్లు పచ్చగానే ఉంటాయి. దీనికి వేలల్లో ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో పళ్లను రెండు నుంచి మూడు నిమిషాల్లో ముత్యల్లా మెరిపించేయొచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదీ చదవండి: Premature Greying Hair: ఖర్చు లేకుండా తెల్లజుట్టును ఇలా నల్లగా మార్చుకోండి!
కొబ్బరి నూనె ..
దంతాల పచ్చదనం పోగొట్టడానికి కొబ్బరినూనె కీలకపాత్ర పోషిస్తుంది. కొబ్బరినూనెలో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది దంతాల్లో పేరుకున్న బ్యాక్టిరియాను పారదోలుతుంది. మనందరి ఇళ్లలో అందుబాటులో ఉంటుంది. కొబ్బరినూనెను పళ్లు తోముకున్న తర్వాత దంతాలపై వేసి రుద్దండి. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.  చివరగా మంచినీటితో దంతాలు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. కావాలంటే మళ్లీ పళ్లు తోముకోవచ్చు. 


ఇదీ చదవండి: ఈ 2 వంటగది వస్తువులతో పాములు పరార్‌.. మీ ఇంటి దరిదాపుల్లోకి రావు..
నారింజ తొక్క.. 
దంతాలు తెల్లబడటానికి నారింజ తొక్క కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆరెంజ్ కూడా పళ్లలో పేరుకున్న ఫలకాలను తొలగిస్తుంది. దంతాలు రెండు నిమిషాల్లో మెరిపించాలంటే నారింజ తొక్కను పొడిచేసి నీటితో పేస్ట్‌ మాదిరి కలపాలి. దీంతో పళ్లను శుభ్రంగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల కూడా దంతాల పసుపుదనం సమస్య తగ్గిపోతుంది. 


నిమ్మకాయ..
పసుపు పళ్ల సమస్య తగ్గించుకోవడానికి నిమ్మకాయం ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. నిమ్మరసం, బేకింగ్ సోడా రెండూ కలిపి దంతాలపై మర్ధనా చేయాలి. ఇలా చేయడం వల్ల దంతాలు రెండు నిమిషాల్లో మెరిసిపోతాయి. ఈ రెండిటినీ కలిపి శుభ్రం చేసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter