HomeRemedies to Keep Snakes Away: ఈ 2 వంటగది వస్తువులతో పాములు పరార్‌.. మీ ఇంటి దరిదాపుల్లోకి రావు..

HomeRemedies to Keep Snakes Away: పాములు విషజీవులు. ఏటా ఎంతోమంది ఈ విషసర్పాల వల్ల చనిపోతున్నారు. పాములు మన ఇంటి చుట్టూ రాకుండా ఉండటానికి కొన్ని మొక్కలు ఉన్నాయి. అలాగే రెండు వంటగది వస్తువులతో పాములు మీ ఇంటి దరిదాపుల్లోకి రాకుండా పారిపోతాయి. అవేంటో తెలుసుకుందాం.

1 /7

పాములు విషజీవులు. ఏటా ఎంతోమంది ఈ విషసర్పాల వల్ల చనిపోతున్నారు. పాములు మన ఇంటి చుట్టూ రాకుండా ఉండటానికి కొన్ని మొక్కలు ఉన్నాయి.అలాగే రెండు వంటగది వస్తువులతో పాములు మీ ఇంటి దరిదాపుల్లోకి రాకుండా పారిపోతాయి. అవేంటో తెలుసుకుందాం.  

2 /7

మీ ఇంటివంటగదిలో ఉండే ఉల్లి, వెల్లుల్లి చాలు. పాములను తరిమికొట్టడానికి ఆ ఘాటు వాసనకు అవి దూరంగా పారిపోతాయి.  

3 /7

ఎందుకంటే ఇవి పాములకు వికర్షంగా పనిచేస్తాయి. ఇవి పిల్లులు, కుక్కలు ఉండని ప్రాంతంలో చల్లాలి. అంటే పెంపుడు జంతువులు ఉండని ప్రాంతంలో ఈ వికర్షలు ఉపయోగించండి.  

4 /7

ఉల్లి, వెల్లుల్లి రెండూ పాములకు పడవు. ఈ రెండు కలిపి శక్తివంతమైన ద్రావణాన్ని తయారు చేయాలి.  

5 /7

ఈ ద్రావణం సిద్ధం చేయడానికి రెండు ముక్కలుగా కట్ చేయాలి. వీటిని ఓ 5 నిమిషాలు ఉడకబెట్టి, కొన్ని గంటపపాటు పక్కనబెట్టాలి.  

6 /7

వడకట్టి స్ప్రే బాటిల్‌లోకి వేసుకోవాలి. ఇది మీ ఇంటి చుట్టూ తోటలో స్ప్రే చేయాలి. ప్రభావవంతంగా పనిచేయడానికి ఇందులో కాస్త రాళ్ల ఉప్పు కలపి చల్లుకోండి.   

7 /7

అంతేకాదు మీ ఇంటి చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి. రాతికుప్పలు, అడ్డదిడ్డంగా పెరిగిన మొక్కలను తొలగించండి. మీ ఇంటి సమీపంలో నీటి వనరులు ఉండే పాములకు ఆవాసాలుగా మారతాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )