Get Rid Of Mosquitoes: పెరుగుతున్న దోమలు.. మీ పిల్లల్ని 6 విధాలుగా రక్షించుకోండి..
Get Rid Of Mosquitoes: దోమల నుంచి పిల్లని రక్షించడానికి పిల్లలకు నిండుగా ఉన్న దుస్తులు మాత్రమే వేయాలి. చర్మాని పూర్తిగా కప్పి ఉంచేలా ఉండాలి. దోమలు కుట్టకుండా ఉంటాయి. అంతేకాదు పిల్లలకు కేవలం లైట్ రంగులో ఉండే దుస్తులు మాత్రమే వేయాలి.
Get Rid Of Mosquitoes: వర్షాకాలం దోమల విపరీతంగా విజృంభిస్తాయి. సీజనల్ వ్యాధులు కూడా మన చుట్టుముడతాయి. అయితే పిల్లలను ఈ సీజన్లో ఎలా కాపాడుకావాలో తెలుసుకుందాం. ముఖ్యంగా దోమలు కుట్టడం వల్ల మలేరియా, డెంగీ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయి. దీనికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం.
డ్రెస్..
దోమల నుంచి పిల్లని రక్షించడానికి పిల్లలకు నిండుగా ఉన్న దుస్తులు మాత్రమే వేయాలి. చర్మాని పూర్తిగా కప్పి ఉంచేలా ఉండాలి. దోమలు కుట్టకుండా ఉంటాయి. అంతేకాదు పిల్లలకు కేవలం లైట్ రంగులో ఉండే దుస్తులు మాత్రమే వేయాలి. కలర్ ఫుల్ గా ఉండే దుస్తులకు దోమలు తొందరగా ఆకర్షితులు అవుతాయి. ఇలా చేయడం వల్ల దోమలు కుట్టడం నుంచి పిల్లల్ని రక్షించవచ్చు.
రెప్పలెంట్..
దోమలు కుట్టకుండా ఉండాలంటే ఇంట్లో మస్కిటో రెప్పలెంట్ ఏర్పాటు చేసుకోవాలి. డీట్ (DEET) ఉండే మస్కిటో రెప్పలెంట్స్ ఉపయోగించాలి. చర్మానికి లైట్ గా అప్లై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల దోమలు కుట్టకుండా ఉంటాయి. పిల్లలు బయట వెళ్లి ఆడుకునేటప్పుడు స్కూల్ కి వెళ్ళినప్పుడు కూడా ఈ రెప్పలను ఉపయోగించాలి దీంతో దోమలు కుట్టకుండా ఉంటాయి.
నిద్ర..
పడుకునేటప్పుడు కూడా దోమలు కుట్టకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి దోమల నెట్ ఉపయోగించటం వల్ల దోమలు రాకుండా ఉంటాయి. దోమల నుంచి రక్షించడమే కాకుండా వాళ్లకి సరైన నిద్ర కూడా పడుతుంది దోమలు కుట్టే బాధ నుంచి కూడా విముక్తి పొందుతారు.
ఇదీ చదవండి: రేపు భారత్‌తోపాటు ఈ 5 దేశాలకు కూడా ఇండిపెన్‌డెన్స్ డే.. ఆ దేశాలు ఏవో తెలుసా?
స్క్రీన్..
దోమలు కుట్టకుండా ఉండేందుకు కిటికీలు, డోర్లకు స్క్రీన్ స్క్రీన్స్ వేసుకోవాలి. సాయంత్రం వేళలో త్వరగా వీటిని మూసేయాలి ఇలా చేయడం వల్ల దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇలా వేసుకోవటం వల్ల బయట నుంచి గాలి నాచురల్ గా ఇంట్లోకి వస్తుంది. అంతే కాదు దోమలు రాకుండా ఉంటాయి. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు వాళ్లకు అదనంగా ఇంకొక లేయర్ వేయించుకోవాలి.
నీరు..
నీటిని నిల్వ ఉంచకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంటి చుట్టుముట్టు పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలి. బకెట్లు బాత్ టబ్బులు వంటివి నీటి విలువ ఉండకుండా ఉండాలి. వీటి వల్ల దోమలు విపరీతంగా పెరుగుతాయి.
ఇదీ చదవండి: రేపు దేశవ్యాప్తంగా అంబరాన్నంటనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. 4000 మంది ప్రత్యేక అతిథులు
మొక్కలు..
ఇంత చుట్టుముట్టు ప్రదేశంలో కూడా దోమలు వికర్షితమయ్యే మొక్కలను పెంచుకోవాలి .లావెండర్ వంటి మొక్కలను మీ ఇంటి పరిసర ప్రాంతాలు పెంచుకోవడం వల్ల దోమల ఉధృతి తగ్గుతుంది.
ఏదైనా పని ఉన్నప్పుడు దోమలు విపరీతంగా తిరిగే సాయంత్రం వేళలో బయట తిరగకుండా ఉండాలి. దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి త్వరగా డోర్లు కిటికీలు మూసివేయాలి. ఇలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దోమల బారి నుంచి పిల్లల్ని కూడా కాపాడినట్లు అవుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter