Chutney Recipe: ఈ బిజీ లైఫ్‌లో ఉదయం ఏ బ్రేక్‌ ఫాస్ట్‌ తయారు చేసుకోవాలి అందులో ఏ చట్నీలు తయారు చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తాం. సమయం లేకపోవడంతో ఎప్పుడు ఒకే రకం చట్నీ తయారు చేసుకోక తప్పదు. సాధారణంగా అయితే,ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో మనం మామూలుగా పుట్నాలు లేదో పల్లీలతో చట్నీ తయారు చేసుకుంటాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొబ్బరి చట్నీ తయారు చేసుకుంటాం ఇది ఇడ్లీ దోశలకు బాగుంటుంది కానీ ఎప్పుడూ ఒకే రకం చట్నీ తయారుచేసుకొని బోర్ ఫీల్ అవుతారు ఈరోజు ఒక ప్రత్యేకమైన చట్నీ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాం ఇది ఎంతో రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తింటారు.


కావలసిన పదార్థాలు..
మినప్పప్పు- 1/2 కప్పు
 కొబ్బరి - కొద్దిగా
చింతపండు ఒక రెమ్మ 
నూనె- కొద్దిగా 
ఉప్పు -రుచికి సరిపడా


ఇదీ చదవండి:  కొబ్బరినూనెలో ఉసిరిపొడిని కలిపి ఇలా అప్లై చేసుకుంటే జుట్టు విపరీతంగా  పెరుగుతుంది..


తాలింపునకు కావాల్సిన పదార్థాలు..
జీలకర్ర 
ఆవాలు 
కరివేపాకు
ఎండుమిర్చి
 మినప్పప్పు


ఇదీ చదవండి: రుచికరమైన సాబుదాన ఖిచిడీ ఇలా ఇన్స్టంట్ గా తయారు చేసుకోండి..


తయారీ విధానం..
ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దానిలో కొద్దిగా నూనె వేసుకొని గుండు మినప్పప్పు వేసి బ్రౌన్ రంగులోకి వచ్చేవరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే జిలకర్ర, కొబ్బరి పొడి చింతపండు రెమ్మ వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సర్ గ్రైండర్ లో వేసుకొని రుబ్బుకోవాల్సి ఉంటుంది. గ్రైండర్ లోంచి చట్నీని వేరే గిన్నెలోకి మార్చుకవోఆలి. 


ఇప్పుడు ఓ కడాయి తీసుకొని అందులో నూనె వేసి జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి మినప్పప్పు కరివేపాకు వేసుకొని ఎరుపు రంగులోకి వచ్చేవరకు వేయించుకోవాలి. ఈ తాలింపు దినుసులను చట్నీలో వేసుకొని కలుపుకుంటే రుచికరమైన మినప్పప్పు చట్నీ రెడీ. ఇది ఎంతో ఆరోగ్య కరం కూడా. ఒకసారి మీరు ట్రై చేస్తే మళ్లీ మళ్లీ తినాలని అనిపిస్తుంది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి