Hair Growth Tips: కొబ్బరినూనెలో ఉసిరిపొడిని కలిపి ఇలా అప్లై చేసుకుంటే జుట్టు విపరీతంగా  పెరుగుతుంది..

Hair Growth Tips: కొబ్బరినూనె, ఉసిరిపొడిని కలిపి తలకు అప్లై చేస్తే జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. జుట్టు పెరుగుదలకు, జుట్టు రాలడానికి చెక్ పెడుతుంది. ఇది జుట్టు కుదుళ్లను ఆరోగ్యవంతం చేస్తుంది.

Written by - Renuka Godugu | Last Updated : Apr 11, 2024, 12:32 PM IST
Hair Growth Tips: కొబ్బరినూనెలో ఉసిరిపొడిని కలిపి ఇలా అప్లై చేసుకుంటే జుట్టు విపరీతంగా  పెరుగుతుంది..

Hair Growth Tips: కొబ్బరినూనె, ఉసిరిపొడిని కలిపి తలకు అప్లై చేస్తే జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. జుట్టు పెరుగుదలకు, జుట్టు రాలడానికి చెక్ పెడుతుంది. ఇది జుట్టు కుదుళ్లను ఆరోగ్యవంతం చేస్తుంది. ఇందులో మంచి న్యూట్రియేంట్లు ఉంటాయి. 

ఉసిరి, కొబ్బరినూనెతో జుట్టు పెరుగుదల..
ఈ రెండూ జుట్టు పెరుగుదలను ప్రొత్సహిస్తాయి. జుట్టుకు బలాన్నిస్తాయి. ఈ రెండిటిలో ఉండే పోషకాలు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.

లోతైన పోషకం..
కొబ్బరినూనె, ఉసిరిపొడి మన జుట్టుకు మంచి వరం. ఇది మన కుదుళ్లకు లోతైన పోషకం లభిస్తుంది. ఉసిరిలో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు, ఉసిరిపొడి జుట్టు కుదుళ్ల నుంచి బలపరుస్తుంది. కొబ్బరినూనె జుట్టు డ్రై అవ్వకుండా కాపాడుతుంది. ఈ రెండు కలిపి అప్లై చేసుకుంటే ఆరోగ్యవంతమైన జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది.

ఇదీ చదవండి: ఓపెన్ పోర్స్‌ సమస్యకు చక్కని రెమిడీ.. ముఖం నునుపుగా మారిపోతుంది..

హెయిర్ ఫాలికల్స్..
ఉసిరిపొడితో రక్తసరఫరా మెరుగవుతుంది. దీంతో జుట్టు కుదుళ్ల నుంచి బలపడుతుంది. ఆమ్లా ఆయిల్ మార్కెట్లలో అందుబాటులో ఉంటాయి. ఇలా కాకుండా ఉసిరిపొడి, కొబ్బరినూనె రెండిటినీ మిక్స్ చేసి తలకు అప్లై చేసుకోవాలి.

యాంటీ డాండ్రఫ్‌..
ఉసిరిపొడి బ్యాక్టిరియాతో పోరాడి ఇన్ఫ్లమేషన్‌ సమస్యను తగ్గిస్తుంది. ఉసిరిపొడి, కొబ్బరినూనె రెండిటినీ కలిపి అప్లై చేసుకుంటే జుట్టుకు మంచిది. మంచి ఫలితాలను పొందాలంటే వారానికి రెండుసార్లు అప్లై చేసుకోండి.

ఇదీ చదవండి: రుచికరమైన సాబుదాన ఖిచిడీ ఇలా ఇన్స్టంట్ గా తయారు చేసుకోండి..

జుట్టు పెరుగుదలకు ప్రేరేపిస్తుంది..
ఉసిరిలో మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. ఇది జుట్టును బలంగా, మెరుస్తూ కనిపిస్తుంది. ఈ రెండు కలిపి జుట్టుకు అప్లై చేసుకుంటే జుట్టు బలంగా పెరుగుతుంది. ఇవి చర్మంపై ఉండే డెడ్‌ సెల్స్ ను తొలగిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News