Quick and Delicious Sabudana khichdi: సబుదాన కిచిడీ ఈ మండే ఎండలో మన శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా రుచికరంగా కూడా ఉంటుంది. సబుదాన కిచిడీని రుచికరంగా అత్యంత తక్కువ సమయంలోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుకుందాం.
కావలసిన పదార్థాలు..
సాబుదాన -ఒక కప్పు
ఆలుగడ్డ-మీడియం సైజ్
పచ్చిమిర్చి -మూడు
జీలకర్ర- ఒక టేబుల్ స్పూన్
నెయ్యి -ఒక టేబుల్ స్పూన్
చక్కర - ఒక టేబుల్ స్పూన్
నిమ్మకాయ రసం
ఉప్పు -రుచికి సరిపడా
ఇదీ చదవండి: తాటిముంజలతో మహాబలం.. తెలిస్తే ఇక అస్సలు వదలరు..
తయారీ విధానం..
సాబుదానను బాగా కడిగి నానబెట్టుకోవాలి చల్లని నీటితో టాప్ వాటర్ కి శుభ్రంగా కడిగి వాటర్ పూర్తిగా తొలగించాలి.సాబుదానకు సరిపడా నీళ్లు పోసి ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి.మరుసటి సాబుదాన వండుకునేటప్పుడు బంగాళదుంపలను తొక్క తీసి కట్ చేసుకుని పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి కట్ చేసిన ఆలుగడ్డ ముక్కలు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించుకోవాలి
ఇప్పుడు కావాలంటే మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి.
ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి మంచి అరోమా వచ్చేవరకు వేయించండి. ఇప్పుడు నానబెట్టిన సాబుదానాలు నుంచి నీళ్లు తీసేసి పాన్ లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఉప్పు చక్కెర కూడా వేసుకోవాలి.వేయించిన పల్లీలు కూడా ఇందులో వేసుకోవాలి ఆ తర్వాత ఆలుగడ్డ ముక్కలు ఉడికే వరకు వండుకోవాలి.
ఇదీ చదవండి: ఈ 4 మూలికలు వేసవిలో శరీరాన్ని లోపలి నుండి చల్లగా ఉంచుతాయి..
ఏడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత నిమ్మరసం కూడా వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter