UPSC Interview Questions: ఏ దేశమైనా పరిపాలనా పరంగా ఎదగడానికి ఆ విభాగంలో పనిచేస్తోన్న వ్యక్తులే కారణమవుతారు. విధి నిర్వహణలో ఎలాంటి పరిస్థితులనైనా చక్కదిద్దేందుకు వారు సిద్ధంగా ఉండాలి. ఎలాంటి క్లిష్ట పరిస్థితులకైనా వారి దగ్గర కచ్చితంగా సమాధానం ఉంటుంది. అలాంటి వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధమైన వారు మన దేశంలో UPSC నిర్వహించే సివిల్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. మన దేశంలో అత్యంత కఠినమైన ఎగ్జామ్ ఇదే. ఇందులో ఉత్తీర్ణత పొందిన వారు భారత దేశానికి వివిధ రంగాల్లో సేవలు చేసే అవకాశాన్ని పొందుతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UPSC పరీక్షల్లో మూడు దశలు


యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రతి సంవత్సరం సివిల్ సర్వీసెస్ పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ పరీక్షలు 3 దశల్లో పూర్తవుతాయి. మొదటి దశలో ప్రిలీమినరీ పరీక్ష (UPSC ప్రీ ఎగ్జామ్), రెండవ దశలో ప్రధాన పరీక్ష (UPSC మెయిన్స్ పరీక్ష).. చివరగా మూడవ దశలో ఇంటర్వ్యూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఔత్సాహికులు ఈ UPSC పరీక్షలకు హాజరవుతారు.


UPSC చాలా కఠినమైన పరీక్ష!


అయితే ఈ పరీక్ష రాసిన లక్షలాది మందిలో చాలా తక్కువ మంది మాత్రమే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారు. ఈ విధంగా ఆ పరీక్ష ఎంత క్లిష్టమైనదో మీరే అర్థం చేసుకోవాలి. దేశంలో నిర్వహించే ఇతర పరీక్షల కంటే సివిల్ పరీక్షలు చాలా కష్టం. ఈ పరీక్షలో ఒక్కసారి ఉత్తీర్ణత సాధిస్తే సరిపోదు. ఈ ప్రక్రియలో ఎంతోమంది మొదటి 2 ఉత్తీర్ణత సాధించినా.. ఇంటర్వ్యూలో వెనుదిరగడం చాలా మందికి జరిగింది. 


ఇంటర్వ్యూ అనుకున్నంత సులభం కాదు!


UPSC ఇంటర్వ్యూలో.. మార్కెట్లో కొనలేని పండు పేరు చెప్పండి? అంటూ అనేక గందరగోళ ప్రశ్నలు అడిగి అభ్యర్ధుల మేధస్సును పరీక్షిస్తారు. కొన్నిసార్లు ఇంటర్వ్యూకు వచ్చిన వారి దగ్గర సరైన సమాధానం లేక అక్కడి నుంచి వెనుదిరగాల్సి వస్తుంది. అయితే UPSC ఔత్సాహికులు.. తమ ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొవాల్సి వస్తుందే ఉదాహరణలు తెలుసుకుందాం. 


ప్రశ్న: ఏ జంతువు గాయపడినప్పుడు మనుషుల్లా ఏడుస్తుంది?


జవాబు: ఎలుగుబంటికి గాయమైతే మనుషుల్లా ఏడుస్తుంది.


 


ప్రశ్న: బ్రిటన్ ఆఫ్ సౌత్ అని ఏ దేశాన్ని పిలుస్తారు?


జవాబు: న్యూజిలాండ్ దేశాన్ని బ్రిటన్ ఆఫ్ సౌత్ అంటారు.


 


ప్రశ్న: మనిషి నిద్ర లేకుండా 8 రోజులు ఎలా జీవించగలడు?
సమాధానం: ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. కానీ, కొంచెం సరిగా ఆలోచిస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఒక వ్యక్తి పగలు నిద్ర పోకుండా.. కేవలం రాత్రిపూట నిద్రిస్తూ.. 8 రోజులు ఎంతకాలం జీవిస్తాడనే విషయాన్ని సమాధానంగా చెప్పవచ్చు. 


 


ప్రశ్న: అలాంటిది నెలకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఒకసారి అది వెళితే దాని కోసం ప్రజలు నెల రోజులు వేచి ఉండాల్సి వస్తుంది?


జవాబు: తేదీ. ఏదైనా తేదీ నెలకోసారి మాత్రమే వస్తుంది. అది వెళ్లిపోతే ప్రజలు దాని కోసం వచ్చే నెల వరకు వేచి ఉండాలి.


 


ప్రశ్న: కోడి గుడ్డు పెడుతుంది, ఆవు పాలు ఇస్తుంది. ఈ రెండింటినీ ఇవ్వగల జీవి పేరు ఏమిటి? 


సమాధానం: దీనికి సమాధానం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. నిజానికి రెండు వస్తువులూ ఇచ్చేది కిరాణా షాపువాడు. కిరాణా దుకాణంలో అమ్మే పాలు, గుడ్లను ప్రజలకు విక్రయిస్తుంటాడు. 


ప్రశ్న: సగం యాపిల్ ఎలా ఉంటుంది?


సమాధానం: మిగిలిన సగం ఆపిల్ లాగా.


 


ప్రశ్న: మార్కెట్‌లో కొంటే ఏ పండు దొరకదు?


జవాబు: కష్టానికి తగ్గ ప్రతిఫలం.


ప్రశ్న: ఒక హంతకుడికి మరణశిక్ష విధించారు. మరణశిక్ష కోసం మూడు గదులు ఏర్పాటు చేశారు. మొదటి గదిలో మంటలు, రెండవ గదిలో తుపాకులు ఉంచబడ్డాయి. అదే సమయంలో మూడో గది లోపల మూడేళ్లుగా ఏమీ తినని పులి ఉంది. అతను మూడు గదులలో దేనికి వెళ్లాలనుకుంటున్నాడు?


సమాధానం: అతను మూడవ గదికి వెళ్తాడు. ఎందుకంటే పులి మూడు సంవత్సరాలు ఆకలితో చనిపోతుంది. 


Also Read: Palindrome and Ambigram date: ఈ రోజు 22 02 2022... ఏమిటి అంత స్పెషల్​?


Also Read: Moles Meaning: శరీరంపై ఆ భాగాల్లో పుట్టుమచ్చ ఉంటే మీరు అదృష్టవంతులే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook