Palindrome and Ambigram date: ఈ రోజు 22 02 2022... ఏమిటి అంత స్పెషల్​?

Palindrome and Ambigram date: ఈ రోజు తేదీకి ఓ ప్రత్యేక ఉంది. ముఖ్యంగా నేటి తేదీ పాలీడ్రోమ్​ అదే విధంగా అంబిగ్రామ్ కూడా. పాలీడ్రోమ్​, అంబిగ్రామ్​ అంటే ఏమిటి? చూద్దామా!

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2022, 11:02 AM IST
  • ఈ రోజు అరుదైన తేదీ
  • అరుదైన పాలీడ్రోమ్​ డేట్​
  • తలకిందులుగా చూసినా ఒకేలా..
Palindrome and Ambigram date: ఈ రోజు 22 02 2022... ఏమిటి అంత స్పెషల్​?

Palindrome and Ambigram date: ప్రతి రోజు ఓ కొత్త రోజే అయినప్పటికి.. కొన్ని తేదీలకు మాత్రం చాలా ప్రత్యేకత ఉంటుంది. ఓ పండుగో, సినిమా రిలీజ్​ తేదీనో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ రోజు తేదీనే చాలా ప్రత్యేకం.

ఈ రోజు తేదీ 22 ఫిబ్రవరి 2022.. అదే సంఖ్యా పరంగా చూస్తే '22022022'. ఈ తేదీని ఎడమ నుంచి కుడికి.. కుడి నుంచి ఎడమకు ఎలా చదివినా ఒకే విధంగా కనిపిస్తుంది. అందుకే ఈ ఇది అత్యంత అరుదైన తేదీ. మళ్లీ మళ్లీ కనిపించని తేదీ.

ఎటు నుంచి చదివినా ఒకే విధంగా కనిపిస్తుంది కాబట్టి.. ఇది పాలీడ్రోమ్​ తేదీ. మరో విశేషం ఏమిటంటే.. ఇది అంబిగ్రామ్ తేదీ కూడా. అంటే ఈ తేదీని తలకిందులుగా చదివినా అందులోని అంకేలు ఒకే విధంగా కనిపిస్తాయి.

ఇంకా ఈ తేదీలో  మరో విశేషం ఏమిటంటే.. మొత్తం అంకెల్లో 2, 0 మాత్రమే ఉన్నాయి. ఎనిమిది డిజిట్స్​ కలిగిన ఈ తేదీలో ఆరు 2 అంకెలు.. రెండు 0 అంకెలు ఉన్నాయి.

ఎక్కువగా రెండు అంకెలు ఉండటం వల్ల ఈ రోజును 'TWOS Day' అని కూడా పిలుస్తారు.

ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల 22 నిమిషాలకు మరో విశిష్ఠత సంతరించుకోనుంది. ఇదివరకే ఇవాళ ఉదయం రెండు గంటలకు ఈ విశిష్టత సంతరించుకుంది.

వారికి చాలా స్పెషల్​..

ఈ రోజు పుట్టిన పిల్లలకు, పెళ్లిల్లు చేసుకునే.. వారికి ఇది ఇంకా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఇంతకి విశిష్ఠత కలిగిన రోజు కాబట్టి.. ఈ రోజును చాలా మంది సెలెబ్రేట్ చేసుకుంటారు. అంతే కాకుండా ఈ రోజును ఎట్టి పరిస్థితుల్లో మరిచిపోయే ఛాన్స్​ లేదు.

Also read: Moles Meaning: శరీరంపై ఆ భాగాల్లో పుట్టుమచ్చ ఉంటే మీరు అదృష్టవంతులే!

Also read: Onion Cutting Tips: ఉల్లిపాయలు తరుగుతుంటే కన్నీళ్లు రాకుండా సింపుల్ టిప్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News