Moles Meaning: శరీరంపై ఆ భాగాల్లో పుట్టుమచ్చ ఉంటే మీరు అదృష్టవంతులే!

Moles Meaning: మనలో చాలామంది శరీరాలపై పుట్టుమచ్చలు ఉంటూనే ఉంటాయి. కానీ, కొందరిలో మాత్రమే అదృష్టాన్ని తెచ్చిపెట్టే మచ్చలు ఉంటాయి. అలాంటి అదృష్ట పుట్టుమచ్చలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2022, 07:33 AM IST
    • అదృష్టాన్ని తెలియజేసే పుట్టుమచ్చలు
    • ఎక్కడెక్కడ ఉంటే కలిసొస్తుందో తెలుసుకోండి!
Moles Meaning: శరీరంపై ఆ భాగాల్లో పుట్టుమచ్చ ఉంటే మీరు అదృష్టవంతులే!

Moles Meaning: మనషుల్లో చాలా మంది శరీరాలపై అనేక గుర్తులు ఉంటాయి. వీటిలో కొన్ని పుట్టుక నుంచే కొనసాగుతుండగా.. మరికొన్ని కాలక్రమేణ సమసి పోతాయి. సముద్ర శాస్త్రం ప్రకారం.. శరీరంపై ఉండే పుట్టు మచ్చల ఆధారంగా వారి వారి జీవితాలపై ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. అలాంటి పుట్టు మచ్చలు చాలా తక్కువ మందిలోనే కనిపిస్తాయి. అలాంటి వారికి అదృష్టం కలిసి రావడంతో ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. అయితే పుట్టుమచ్చలను బట్టి కూడా మనిషి ప్రవర్తన, మానస్థితి, భవిష్యత్ గురించి కూడా తెలుసుకునే అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

ముక్కు మీద పుట్టుమచ్చ

ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే వ్యక్తి చాలా ప్రతిభావంతుడు అని అర్థం. ఆ వ్యక్తి ఆనందంగా జీవితాన్ని గడుపుతాడు. అదే సమయంలో, స్త్రీల ముక్కుపై పుట్టుమచ్చ ఉండటం వారు చాలా అదృష్టవంతులని సముద్ర శాస్త్రం చెబుతుంది.

కనురెప్పలపై పుట్టుమచ్చ

కనురెప్పలపై పుట్టమచ్చలు కలిగిన వారి చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారు. కంటిరెప్పలపై మచ్చ ఉన్నవారు సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. 

కంటిపై పుట్టుమచ్చ

పురుషుడి కుడి కన్నుపై పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి తన భార్యతో సుఖమైన  జీవితాన్ని పొందుతాడు. అలాగే ఎడమ కన్నుపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తి.. తన భార్యతో సుఖ జీవనాన్ని గడుపలేడు. 

కనుబొమ్మలపై పుట్టుమచ్చ

రెండు కనుబొమ్మలపై పుట్టుమచ్చ ఉన్నవారు.. వారి జీవితం తరచుగా ప్రయాణాలు చేస్తుంటారు. కుడి కనుబొమ్మపై ఉన్న పుట్టుమచ్చ అంటే వ్యక్తి జీవితం సంతోషంగా గడిచిపోతుంది. ఎడమ కనుబొమ్మపై ఉన్న పుట్టుమచ్చ సంతోషకరమైన వివాహాన్ని సూచిస్తుంది.

కంటి కనుపాపపై పుట్టుమచ్చ

చాలామందిలో అరుదుగా కంటిలోని కనుపాపపై పుట్టుమచ్చ ఉంటుంది. అది చాలా ముఖ్యమైనది. ఆ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉంటాయో ఈ పుట్టుమచ్చ చెబుతుంది. కుడి కంటిలోని కనుపాపపై పుట్టుమచ్చ ఉంటే.. ఆ వ్యక్తి ఉన్నతమైన ఆలోచనలతో ఉంటాడని అర్థం. అదే విధంగా ఎడమ కనుపాపపై ఉంటే ఆ వ్యక్తి ఆలోచనలు తక్కువ స్థాయిలో ఉంటాలని తెలుస్తోంది. 

చెవిపై పుట్టుమచ్చ

చెవిపై పుట్టుమచ్చ ఉండటం వ్యక్తి తక్కువ ఆయుష్యు కలిగి ఉంటారని తెలుస్తోంది. 

పెదవులపై పుట్టుమచ్చ

స్త్రీల పెదవులపై పుట్టుమచ్చ ఉంటే, అది వారి అందాన్ని పెంచుతుంది. అలాగే సముద్ర శాస్త్రం ప్రకారం.. పెదవిపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తి గొప్ప ప్రేమికుడిగా ఎదుగుతాడు. కానీ పెదవి కింద పుట్టుమచ్చ ఉంటే జీవితంలో పేదరికం ఉంటుంది.

మూతిపై పుట్టుమచ్చ

మూతిపై లేదా చుట్టూ ఉండే పుట్టుమచ్చ స్త్రీ పురుషులిద్దరికీ శుభప్రదం. వారు సంతోషకరమైన, సంపన్నమైన జీవితాన్ని గడుపుతారు. అదృష్టవంతులుగా ఉండటానికి ఇది సంకేతం.

చెంప మీద పుట్టుమచ్చ

చెంప మీద ఎర్రటి పుట్టుమచ్చ ఉండటం చాలా శుభప్రదం. మరోవైపు, ఎడమ చెంపపై నల్లని పుట్టుమచ్చ ఉన్న వ్యక్తిని పేదవాడిగా, కుడి చెంపపై నల్లని పుట్టుమచ్చ ఉన్న వ్యక్తిని ధనవంతునిగా మారుస్తుంది.

దవడ కింద పుట్టుమచ్చ

దవడ మీద పుట్టుమచ్చ అనేది చాలా తక్కువ మందిలో మాత్రమే కనిపిస్తుంది. అటువంటి పుట్టుమచ్చ ఎల్లప్పుడూ ఒక వ్యక్తి జీవితంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 

(నోట్: పైన పేర్కొన్న సమాచారం అంతా సముద్ర శాస్త్రం నుంచి సంగ్రహించినది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరిచడం లేదు.) 

Also Read: Pinky Finger: మీ పింకీ ఫింగర్‌ను చూసి మీరెలాంటి వారో చెప్పొచ్చు.. ఎలాగో తెలుసా..

Also Read: Chocolate Day 2022: చాక్లెట్ డే సందర్భంగా మీరు ఇష్టపడే వారికి ఈ బహుమతులు ఇవ్వండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News