Glowing Skin With Tomato: టమాటో ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇది ముఖాన్ని మెరిపిస్తుంది, మచ్చలేని అందం మీ సొంతం అవుతుంది. టమాటాలో లైకోపీన్‌ పుష్కలంగా ఉంటుంది.  టమాటా సౌందర్య పరంగా కూడా ఎన్నో విధాలుగా మనకు లాభాలు కలిగిస్తుంది. అవి ఏంటో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టమాటాను ప్యూరీ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేసి ముఖానికి స్క్రబ్ మాదిరి రాసుకోవాలి. ఇలా స్క్రబ్ చేయడం వల్ల కాంతివంతం అవుతుంది. రుజువుగా సర్క్యూలర్‌ మోషన్లో స్క్రబ్ చేసిన తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. ఇది స్కిన్‌ పై ఉన్న ట్యాన్‌ తొలగిస్తుంది.


టమాటా, అరటిపండు...
టమాటా అరటిపండు రెండిటిని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేస్తే చర్మం కాంతివంతం అవుతుంది. అరటి పండులో పొటాషియం, విటమిన్స్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ముఖం మచ్చలేని ముఖం మీ సొంతం అవుతుంది. అరటిపండు మెరిగే గ్లాసీ స్కిన్‌ కూడా మీ సొంతమవుతుంది.


టమాటా, తేనె..
టమాటా తేనె రెండిటిని కలిపి ఇందులో కోకో పౌడర్ కూడా మిక్స్ చేసి ముఖానికి పట్టించడం వల్ల చర్మంపై ఉండే డెడ్‌ స్కిన్‌ సెల్స్‌ తొలగిపోతాయి. తేనే ముఖానికి న్యాచురల్ లుక్‌ ఇస్తుంది. తేనె పట్టులాంటి గ్లోని అందిస్తుంది.


ఇదీ చదవండి:  కొబ్బరిపాలతో పొడవాటి, మందపాటి జుట్టు.. ఇలా వాడితే మ్యాజిక్‌ చూస్తారు..


టమాట, బేకింగ్ సోడా..
ఈ రెండిటినీ టమాటాను మెత్తగా పేస్ట్ చేసి అందులో టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి ముఖంపై స్క్రబ్ చేసుకోవాలి మృదువుగా స్క్రబ్ చేసుకోవడం వల్ల ముఖంపై ఉండే నలుపుదనం తగ్గిపోతుంది. ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.


టమాటా, పెరుగు..
ఈ రెండిటిని కూడా బాగా కలిపి మిక్స్ చేసుకొని ముఖంపై స్క్రబ్‌ చేసుకుంటే కాంతివంతమైన మచ్చలేని చర్మం మీ సొంతం అవుతుంది ఐదు నిమిషాల తర్వాత చల్ల నీటితో ముఖానికి అడగాలి. ఇది కూడా ముఖంపై కాంతివంతమైన గ్లో అందిస్తుంది.


ఇదీ చదవండి: సండే మటన్‌ కర్రీని ఇలా ధాబా స్టైల్‌లో చేసుకుని తినండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..


టమాటా, కొబ్బరి నూనె..
టమాటాను మెత్తగా పేస్ట్ చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కూడా వేసి ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంపై ఉండే అదనపు నూనెను గ్రహిస్తుంది. ముఖానికి మాయిశ్చర్ అందిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి