Dhaba Style Mutton Curry Recipe: ధాబా స్టైల్‌లో ఏ రిసిపీ తయారు చేసుకున్న రుచి అదిరిపోతుంది. అందుకే ఈరోజు ధాబా స్టైల్‌లో మటన్ కూరను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ రుచికరమైన కూర ఒక్కసారి ప్రయత్నిస్తే మళ్లీ మళ్లీ ట్రై చేస్తారు. ఎందుకంటే దీని రుచి అంత అద్భుతంగా ఉంటుంది.
మ్యారినేట్ చేయడానికి కావాల్సిన పదార్థాలు..
మటన్ - అరకేజీ
పెరుగు -3 Tbsp
కారం-1 tbsp
పసుపు-1/2Tbsp
ఉప్పు- రుచికి సరిపడా
కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..
నూనె -2tbsp
జిలకర్ర పొడి- 1 tbsp
ధనియాల పొడి- 1 tbsp
గరం మసాలా- 1 tbsp
వెల్లుల్లి రెబ్బలు-3
ఎండు మిర్చి-2
కారం -1/2 tbsp
పసుపు-1/2 tbsp
కట్ చేసిన టమాటాలు-2
అల్లం వెల్లుల్లి పేస్ట్- 1tbsp
ఉప్పు- రుచికి సరిపడా
కరివేపాకు, కొత్తిమీర
ఇదీ చదవండి: రోజూ రోజ్ వాటర్‌తో మీ ముఖానికి మసాజ్ చేస్తే ఏమవుతుంది? నిపుణులు చెప్పేది ఇదే..
రిసిపీ తయారు చేసుకునే విధానం..
మటన్‌ను ముందుగా శుభ్రంగా కడగాలి ఆ తర్వాత నీటిని వంపేసి కారం, పసుపు, పెరుగు ఉప్పు వేసి కనీసం ఓ అరగంటపాటు మ్యారినేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకుని అందులో ఈ మ్యారినేట్ చేసిన మటన్, నూనె, కారం, పసుపు, జిలకర్ర పొడి, ధనియాల పొడి గరంమసాలా కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు అరకప్పు నీరు కూడా వేసి మటన్ మెత్తగా ఉడికేవరకు కుక్కర్‌లో ఉడికించుకోండి.
ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు కూడా వేసి వేయించుకోవలి. ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేసి బంగారు వర్ణం వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, తాజా కొత్తిమీర కూడా వేసి ఉడికించుకోవాలి.
ఇదీ చదవండి: ఉదయం ఖాళీకడుపున ఈ ఒక్క రసం తాగితే డయాబెటీస్ మీ దరిదాపుల్లోకి రాదు..
ఇందులోనే కట్ చేసిన టమాటాలు కూడా వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఉడికించుకున్న మటన్ మసాలాతోపాటు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని మరో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి చివరగా కొత్తిమీరతో గార్నిష్‌తో చేసుకుని వేడివేడిగా తినండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి